RCB Stampede Social Media| రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ తొలి ఐపీఎల్ టైటిల్ విజయాన్ని బెంగుళూరులో అట్టహాసంగా జరుపుకుంది. అయితే, మే 4, 2025 బుధవారం జరిగిన విజయోత్సవాల్లో స్టేడియం వెలుపల తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై ఆర్‌సీబీ ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉండటం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.పైగా అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపే ట్వీట్‌ను తమ అధికారిక ‘X’ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
ఈ విషాద ఘటనపై ఆర్‌సీబీ మౌనం వహించడంతో ‘హ్యావ్ సమ్ షేమ్’ (మీకు ఏ మాత్రం సిగ్గు లేదా?) అనే హ్యాష్‌ట్యాగ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.ట్విట్టర్ ‘X’ ప్లాట్‌ఫామ్‌లో అనేక మంది యూజర్లు ఆర్‌సీబీని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనకు ప్రభుత్వాన్ని కూడా కొందరు బాధ్యులని చేశారు. అయినప్పటికీ, ఆర్‌సీబీ జట్టు సభ్యులు ఫెలిసిటేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కొనసాగించారు, ఇది అభిమానుల ఆగ్రహాన్ని మరింత పెంచింది.
ఈ విషాదం జరిగినప్పటికీ, ఆర్‌సీబీ జట్టు తమ విజయాన్ని జరుపుకోవడంపై అభిమానులు నిరాశ, ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఈ గుండెలు పగిలే సంఘటనలో ప్రాణనష్టం జరిగినా, జట్టు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అభిమానులను కలవరపరిచింది. ఆర్‌సీబీ అభిమానులు ఎప్పటిలాగే జట్టుకు మద్దతు ఇచ్చినప్పటికీ, ఈ ఘటనపై జట్టు నిశ్శబ్దం నెటిజెన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది నెటిజెన్లు అయితే.. ఆర్సీబి తన అభిమానుల శవాలను ఎదురుగా పెట్టుకొని విజయోత్సవాలు జరుపుకుంది అని పోస్ట్‌లు చేశారు. ఇంకొక యూజర్ అయితే.. ఆర్సీబి యజమాన్యం విజయోత్సవాల పేరుతో దేశాన్ని రక్తపాతంతో ఎర్రగా పెయింట్ చేసింది అని కామెంట్ చేశాడు. తన పోస్ట్ ని ఒక లైక్ చేస్తే.. ఆర్సీబీ యజమాన్యంపై ఒక చెంపదెబ్బ కొట్టినట్లు అని రాశాడు. అయితే ఈ పోస్ట్‌లపై కొంతమంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా కేవలం ప్రమాదవశాత్తు జరిగిందని.. ఇందులో ఆర్సీబీ మేనేజ్మెంట్ తప్పు లేదని సమాధానం ఇచ్చారు. మరికొందరైతే ఈ ట్రోలింగ్ అంతా చెన్నై జట్టు ఫ్యాన్స్ చేస్తున్నారని రాశారు.
Also Read: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడలేను.. ఐపిఎల్ రిటైర్మెంట్‌పై స్పందించిన కొహ్లీ
ఆర్‌సిబీ జట్టు 18 ఏళ్ల తరువాత తొలి ఐపీఎల్ టైటిల్ సాధించినప్పటికీ, విషాద ఘటనపై స్పందించకపోవడం వల్ల అభిమానులు జట్టు పట్ల నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆర్‌సీబీ విజయ ఆనందాన్ని విషాదంతో కప్పేసింది.
BLACK DAY IN CRICKET HISTORY @RCBTweets @imVkohli 🙏 pic.twitter.com/uhQqbm6CRR
— CSK Fans Army™ (@CSKFansArmy) June 4, 2025