E-Paper
Advertisement

రూపాయి కాయిన్ మింగిన చిన్నారి.. ఆపై కోమాలోకి.. రెనోవా ఆస్పత్రి ఘోర నిర్లక్ష్యం!

రూపాయి కాయిన్ మింగిన చిన్నారి.. ఆపై కోమాలోకి.. రెనోవా ఆస్పత్రి ఘోర నిర్లక్ష్యం!
Advertisement

Hospital Negligence: అది 2020 నవంబరు 30.. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన అఖిలేష్ కుమార్తె అన్షిక ఆడుకుంటూ సడెన్‌గా రూపాయి కాయిన్ మింగేసింది. కంగారుపడిన తల్లిదండ్రులు బంజారాహిల్స్‌ లోని రెనోవా N.I.G.L ఆసుపత్రి తలుపు తట్టారు. ట్రీట్‌మెంట్‌ ముందు మా పాప అన్నం తినింది, అరటిపండ్లు తినిపించామని తల్లిదండ్రులు నోత్తినోరు మొత్తుకున్నారు. అవేవి పట్టించుకోకుండా ఎండోస్కోపీ చేశారు.

ఆ సమయంలో చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆహారం ఊపిరితిత్తుల్లోకి చేరి ఆ పసికందుకు ఊపిరి ఆడలేదు. మెదడుకు పది నిమిషాల పాటు ఆక్సిజన్ అందక కోమాలోకి జారుకుంది. 72 గంటల్లో కోలుకుంటుందని చెప్పిన ఆ డాక్టర్ల మాటలు కలగానే మిగిలిపోయాయి. 100 శాతం శాశ్వత వైకల్యంతో ఇప్పటికే మంచానికే పరిమితమైంది.

Advertisement

న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కారు. సుదీర్ఘ విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్-2… ఆసుపత్రి చేసిన ఘోరమైన నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. WHO ప్రమాణాలు పాటించకుండా ఓ పాప జీవితాన్ని నాశనం చేసినందుకు కోటి 77 లక్షల జరిమానా విధించింది. ఇక్కడ ప్రశ్న పరిహారం గురించి కాదు.. బాధ్యత గురించి. డాక్టర్ చేతిలో ప్రాణాలు పెడుతున్న ప్రతి కుటుంబానికి భద్రతపై హామీ ఎవరు ఇస్తారు? ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తే… ఆ నష్టాన్ని ఏ పరిహారం భర్తీ చేయగలదు?

Tags

Related News

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

Big Stories

Advertisement
×