E-Paper
Advertisement

HDFC Bank Services Down: అలర్ట్.. HDFC నెట్‌ బ్యాంకింగ్ సర్వీసులు బంద్, ఎందుకంటే?

HDFC Bank Services Down: అలర్ట్.. HDFC నెట్‌ బ్యాంకింగ్ సర్వీసులు బంద్, ఎందుకంటే?
Advertisement

HDFC Bank Alert: వినియోగదారులకు HDFC బ్యాంక్ కీలక అలర్ట్ జారీ చేసింది. నెట్ బ్యాంకింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు అందుకు తగినట్లుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇంతకీ ఎందుకు తన బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తుంది? ఏ రోజు ఎన్ని గంటలు ఆపేస్తుంది? అనే వివరాలను ముందుగానే తన కస్టమర్లకు మెసేజ్ ల రూపంలో అందిస్తుంది.

నాలుగు గంటల పాటు సర్వీసులు బంద్

HDFC బ్యాంక్ తన నెట్ బ్యాంకింగ్ సర్వీసులను మరింత మెరుగు పరిచేందుక సిస్టమ్ మెయింటెనెన్స్ చేస్తున్నట్లు చెప్పింది. అందులో భాగంగానే సర్వర్ అప్ డేట్ చేస్తున్నట్లు వివరించింది. ఈ నెల 23, 2025న కొద్ది గంటల పాటు నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆరోజు అర్థరాత్రి 12 గంటల నుంచి మొదలుకొని తెల్లవారుజామన 4 గంటల వరకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ 4 గంటల పాటు అన్ని HDFC బ్యాంక్ బ్రాంచ్ లకు చెందిన నెట్‌ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.

ఆ సమయంలో ఏం చేయాలంటే?

Advertisement

నవంబర్ 23న ఆ నాలుగు గంటల పాటు లావాదేవీలు నిర్వహించాలనుకునే HDFC బ్యాంక్ వినియోగదారులు HDFC బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, PayZapp, MyCards, WhatsApp ద్వారా చాట్‌ బ్యాంకింగ్ ఉపయోగించుకోవచ్చని సూచించింది. తమ సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వినియోగదారులు తమ సాకారాన్ని అందించాల్సిందిగా కోరింది. తమ సేవల మీద నిరంతరమైన నమ్మకాన్ని ఉంచుతున్న ప్రతి అకౌంట్ హోల్డర్ కు ధన్యవాదాలు తెలిపింది.

Read Also: మౌస్, కీ బోర్డ్.. కదలకపోతే ఖాళీగా ఉన్నట్లే.. ఉద్యోగులపై కాగ్నిజంట్ నిఘా? ఆ సంస్థ ఏం చెప్పిందంటే?

ఇప్పటికే వినియోగదారులకు అలర్ట్ మెసేజ్ లు

Advertisement

అటు ఈ అంతరాయానికి సంబంధించి HDFC బ్యాంక్ తన వినియోగదారులకు ఇప్పటికే అలర్ట్ మేసేజ్ లను అందిస్తుంది. “Scheduled Downtime Alert for All New HDFC NetBanking on 23rd Nov 2025” అంటూ మొబైల్ ఫోన్లకు మెసేజ్ లను అందిస్తుంది. ఆ ఒక్కరోజు తమకు సహకరిస్తే, ఆ తర్వాత మెరుగైన సర్వీసులను పొందే అవకాశం ఉందని వినియోగదారులకు HDFC బ్యాంక్ హామీ ఇచ్చింది.

Read Also:  పసిడి ప్రియులకు బిగ్‌షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే..!

Related News

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్, బుకింగ్ సమయం తగ్గింపు

జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు.. వెలుగులోకి కొత్త విషయాలు, సమాచారం హక్కు చట్టం ద్వారా..

ఈసారి పండుగలకు చేదు రుచి.. భారీగా పెరగనున్న స్వీట్స్ ధరలు

బ్యాంక్ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు వస్తుంది? ఈ రూల్స్ తెలుసుకోండి

ఓల్డ్ మాంక్ రమ్ అసలు రమ్మే కాదు.. ఇంతకాలం మందుబాబులను కంపెనీ మోసం చేసిందా?

Big Stories

Advertisement
×