Brahmanandam Imitates Kamal Haasan On Stage Bharateeyudu 2 Pre Release Event: లోకనాయకుడు కమల్‌హాసన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సంచలన దర్శకుడు కె బాలచందర్ దర్శకత్వంలో 1978 ఏడాదిలో వచ్చిన మరోచరిత్ర మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం శుభసంకల్పం ఈ మూవీకి సైతం సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం గొప్ప విశేషం.తన యాక్టింగ్ టాలెంట్‌తో ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు.తాజాగా డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ కల్కి.ఈ మూవీలో విలన్ రోల్ పోశించారు కమల్‌హాసన్.
అంతేకాదు ఇందులో నవ్వుల రారాజు బ్రహ్మానందం సైతం నటించి నవ్వులు పూయించారు.ఈ మూవీలో నటించింది కొన్ని నిమిషాలే అయిన తనదైన శైలిలో యాక్టింగ్ ఇరగదీశారు.అంతేకాదు తన నటనలో తనే పోటీ అనేలాగా నటించి అందరి మెప్పుపొందారు.ఇక ఇదిలా ఉంటే కమల్ హీరోగా నటించిన తాజా మూవీ భారతీయుడు 2.ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం తనదైన స్టైల్లో మిమిక్రీ చేసి అందరిని షాక్‌కి గురిచేశారు.కమల్‌హాసన్‌లా ఇమిటేట్ చేసి అందరు కంగుతిన్నారు.భారతీయుడు ఫస్ట్ పార్ట్‌ని హిట్ చేశారు. ఇప్పుడు రెండో పార్ట్‌తో రెడీ అయ్యాను.ఈ మూవీ కోసం ఎక్కువ కష్టపడ్డాను.
Also Read: స్టార్ డైరెక్టర్ నా జీవితం నాశనం చేశాడని నటి ఆవేదన
దక్షిణాది ఆడియెన్స్ నన్నెంతో ఆదరిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందని, ఈ సంతోషంలో నాకు మాటలు రావడం లేదని అన్నారు. ఈ మూవీని మీరంతా ఆదరిస్తే ఇంకాస్త సంతోషిస్తా ఉంటా మీ కమల్‌హాసన్ అని బ్రహ్మానందం మాట్లాడారు. ఈ స్పీచ్‌కి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కమల్‌హాసన్ కూడా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ కామెడీ కింగ్ బ్రహ్మీ అంటూ బ్రహ్మానందంకి కితాబ్ ఇస్తున్నారు. అంతేకాకుండా కమల్‌హా, లేక బ్రహ్మానందమా అనే డైలమాలో ఉన్నామంటూ వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
#Brahmanandam gaaru Imitating #KamalHassan ❤️#Bharateeyudu2 #KamalHaasan pic.twitter.com/34id3MOoVL
— Milagro Movies (@MilagroMovies) July 7, 2024