E-Paper
Advertisement

Best Selling Bike in June: చవకైన బైక్.. 30 రోజుల్లో రూ. 3 లక్షలకు పైగా సేల్స్.. సామాన్యుల కోసమే వచ్చింది..!

Best Selling Bike in June: చవకైన బైక్.. 30 రోజుల్లో రూ. 3 లక్షలకు పైగా సేల్స్.. సామాన్యుల కోసమే వచ్చింది..!
Advertisement

Splendor Plus: దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో చిన్న ఇంజన్ బైక్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అత్యంత చౌక బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు, మైలేజీ కారణంగా వినియోగదారులు ప్రతి నెలా 100cc నుండి 125cc వరకు ఇంజిన్‌లతో కూడిన బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. అందులో హీరో మోటోకార్ప్‌కు చెందిన బైక్‌లు ముందు వరుసలో ఉంటాయి. హీరో మోటోకార్ప్‌ దేశీయ మార్కెట్‌లో బడ్జెట్ బైక్‌లను రిలీజ్ చేస్తూ ఎవరికీ అందని ఎత్తులో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ కంపెనీకి చెందిన బైక్‌లు అత్యధికంగా సేల్ అవుతూ సంస్థను నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతున్నాయి. అందులో హీరో స్ప్లెండర్ ప్లస్ అగ్రస్థానంలో ఉంటుంది.

కాగా గత నెల అంటే జూన్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ల సేల్స్ విషయానికొస్తే.. జూన్ 2024లో కంపెనీ దాదాపు 3,05,586 యూనిట్ల హీరో స్ప్లెండర్ ప్లస్‌లను సేల్ చేసింది. దీని బట్టి చూస్తే వాహన ప్రియులు ఈ బైక్‌పై ఎంతటి ఆసక్తి చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ బైక్ డిజైన్, ఫీచర్ల విషయానికొస్తే.. హీరో స్ప్లెండర్ ప్లస్ సాధారణ డిజైన్ కారణంగా ఇప్పటికీ ఎంతోమందిని ఆకర్షిస్తోంది. నేటికీ దాని డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. స్ప్లెండర్ ప్లస్ 112 కిలోల బరువుతో వస్తుంది. ఇందులో 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ బైక్ రూ.75,441 నుండి రూ.89,078 ఎక్స్-షోరూమ్ ధర వరకు అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: వృద్ధులకు సో బెటర్.. రూ. 49000కే ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజీలో కింగ్..!

ఇక దీని ఇంజన్ విషయానికొస్తే.. Splendor Plus 97.2cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 7.9 bhp శక్తిని, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అమర్చారు. కాగా ఇటీవలే స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో కంపెనీ కొత్త గ్రాఫిక్స్, ఫీచర్లతో ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. అంతే కాదు బైక్ మైలేజీ కూడా పెరిగింది. ఈ Splendor Plus కొత్త ఎడిషన్‌లో 100cc i3s ఇంజన్ ఉంది.

Advertisement

ఇది 7.9 bhp శక్తిని, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కూడా 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ బైక్ ఒక లీటర్‌ పెట్రోల్‌తో 73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్ కలిగి ఉంది. ఇందులో రియల్ టైమ్ మైలేజ్ ఇన్‌ఫర్‌మేషన్ లభిస్తుంది. ఇది కాకుండా బ్లూటూత్, కాల్స్, SMS, బ్యాటరీ అలర్ట్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. అలాగే మీ ఫోన్‌ను ఛార్జ్ చేయగల USB పోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీని ముందు, వెనుక టైర్లలో డ్రమ్ బ్రేక్‌లు అందుబాటులో ఉంటాయి.

Related News

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

Big Stories

Advertisement
×