E-Paper
Advertisement

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి రూ. లక్ష వడ్డీ రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి?

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి రూ. లక్ష వడ్డీ రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి?
Advertisement

FD Interest: మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన రాబడిని కోరుకునే చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) వైపు మెుగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా రిటైరైన ఉద్యోగులు, వృద్ధులు తమ పొదుపు మొత్తం భద్రంగా ఉంచుకుంటూ క్రమం తప్పకుండా వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందడానికి ఎఫ్‌డీలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే ఎఫ్‌డీ ద్వారా ఏడాదికి కచ్చితంగా రూ. లక్ష వడ్డీ రావాలంటే ఎంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. దానిని ఈ కథనంలో నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం.

6.5 శాతం వడ్డీ ఇస్తే

ఒకవేళ బ్యాంక్ ఏడాదికి 6.5 శాతం వడ్డీ ఇస్తుంటే, రూ. లక్ష వడ్డీ అందుకోవడానికి దాదాపు రూ. 15.38 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. (రూ. 1,00,000 ÷ 6.5% = రూ. 15.38 లక్షలు). పన్ను మినహాయించకముందు ఇది నెలకు సరాసరి రూ. 8,333 చొప్పున ఇస్తుంది.

7 శాతం వడ్డీ ఇస్తే

Advertisement

వడ్డీ రేటు 7 శాతానికి పెరిగితే అవసరమయ్యే పెట్టుబడి తగ్గుతుంది. రూ. 1,00,000 ÷ 7% = రూ. 14.29 లక్షలు. అంటే ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ. లక్ష వడ్డీ వస్తుంది.

7.5 శాతం వడ్డీ ఇస్తే

కొన్ని ప్రత్యేక కాలపరిమితి డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలపై ఈ స్థాయి ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 7.5 శాతం లెక్కన రూ. 1,00,000 ÷ 7.5% = రూ. 13.33 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

8 శాతం వడ్డీ ఇస్తే

Advertisement

ఒకవేళ వడ్డీ రేటు 8 శాతంగా ఉంటే రూ. 1,00,000 ÷ 8% = రూ. 12.50 లక్షలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది.

సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ

సాధారణంగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు సాధారణ కస్టమర్ల కంటే అదనపు వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. ఉదాహరణకు సాధారణ కస్టమర్‌కు 7 శాతం, సీనియర్ సిటిజన్‌కు 7.5 శాతం వడ్డీ లభిస్తే… సాధారణ వ్యక్తి రూ. 14.29 లక్షలు డిపాజిట్ చేయాల్సి వస్తే సీనియర్ సిటిజన్ అంతే రాబడి కోసం కేవలం రూ. 13.33 లక్షలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది.

Also Read: మెుబైల్ పాస్‌వర్డ్ లేదా పాటర్న్ మర్చిపోయారా? ఆందోళన వద్దు.. ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేయండి!

రూ. లక్ష వడ్డీ 100% చేతికి రాదు!

ఇదిలా ఉంటే ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ట్యాక్స్ వర్తిస్తుందనే విషయాన్ని డిపాజిటర్లు గుర్తుంచుకోవాలి. వడ్డీ ఆదాయం నిర్దిష్ట పరిమితి దాటితే బ్యాంకులు టీడీఎస్ (TDS) కూడా మినహాయిస్తాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు బ్యాంక్ వడ్డీ పరిమితి రూ. 50,000 కాగా సీనియర్ సిటిజన్లకు ఇది రూ. 1 లక్షగా ఉంది. కాబట్టి ఏడాదికి రూ. లక్ష స్థూల (గ్రాస్) వడ్డీ వస్తుందని ఆశించేవారు… ఆ మొత్తం పూర్తిగా తమ చేతికి వస్తుందని భావించకూడదు. మొత్తం వార్షిక ఆదాయాన్ని బట్టి పన్ను మినహాయింపు ఉంటుంది.

Also Read: ఈఎంఐలు కట్టలేక అల్లాడుతున్నారా? ఈ 5 ట్రిక్స్ పాటిస్తే చాలు.. దెబ్బకు బయటపడతారు!

Tags

Related News

ఈఎంఐలు కట్టలేక అల్లాడుతున్నారా? ఈ 5 ట్రిక్స్ పాటిస్తే చాలు.. దెబ్బకు బయటపడతారు!

రూ.22 లక్షల ప్లాట్ రూ.8 కోట్లకు విక్రయించిన సీనియర్ సిటిజెన్‌కు పన్ను నోటీస్.. కోర్టులో ఇలా వాదించి గెలిచాడు

క్రెడిట్ కార్డు ఓవర్‌లిమిట్ సదుపాయం వల్ల లాభాలు, నష్టాలు.. భారీ ఫైన్ పడకుండా ఈ టిప్స్ పాటించండి

ఉద్యోగం వదిలి వ్యవసాయం.. ఎకరాకు రూ.30 లక్షలు ఆదాయం.. ఆంధ్రా యువకుడి భలే ఐడియా

రూ. కోట్లు ఖర్చు చేసి కారు పార్కింగ్ స్థలాలు కొనుగోలు చేసిన మహిళ.. డబుల్ ఆదాయం

‘వంటమనిషికి నెలకు రూ.8000 చెల్లిస్తున్నా.. వంట యువరేజ్’..బెంగుళూరు మహిళ పోస్ట్ వైరల్

బ్యాంకులకు కొత్త కష్టాలు..రూల్స్ మార్చేసిన ఆర్బీఐ, అసలు మేటరేంటి?

Big Stories

Advertisement
×