E-Paper
Advertisement

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీకాంత్ కుమార్తె మేధా… పూర్తి డీటెయిల్స్ ఇవే!

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న  శ్రీకాంత్ కుమార్తె మేధా… పూర్తి డీటెయిల్స్ ఇవే!
Advertisement

Sreekanth Daughter Medha: సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం. ఒక కుటుంబంలో హీరో లేదా హీరోయిన్ ఉన్నారు అంటే ఆ కుటుంబం నుంచి తమ వారసులు కూడా ఇండస్ట్రీలోకి రావడం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎంతోమంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ (Sreekanth) కుమార్తె మేధా (Medha)సైతం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఘనంగా ప్రారంభమైన శ్రీకాంత్ కుమార్తె మేధా సినిమా..

తాజాగా కుమార్తె మేధా సైతం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈమె మొదటి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి. మరి మేధా నటిస్తున్న మొదటి సినిమా ఏది హీరో ఎవరనే విషయానికి వస్తే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు శ్రీకాంత్ కుమార్తె మేధాను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాల ద్వారా అధికారక ప్రకటన తెలియజేశారు.ఈ చిత్రంలో ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ ఫేమ్ జై జాస్తి (Jai Jasti) హీరోగా నటిస్తున్నారు.

మైత్రీ ఇన్ లవ్..

Advertisement

ఇలా వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సోషల్ మీడియాలో ‘మైత్రీ ఇన్ లవ్’(Mythri In love) అనే హాష్ ట్యాగ్ జోడిస్తూ సినిమాపై భారీ క్యూరియాసిటీని పెంచేసాయి. ఇక ఈ సినిమాకు మహేష్ బాబు పి క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు పరిచయమైన పృథ్వీ వనం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా నందిని రెడ్డి క్లాప్ కొట్టగా పలువురు దర్శక నిర్మాతలు ఈ సినిమా పూజా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇప్పటికే శ్రీకాంత్(Sreeknath) కుమారుడు రోషన్ పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల ఈయన ఛాంపియన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇలా శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇండస్ట్రీలో స్థిరపడుతున్న నేపథ్యంలోనే ఆయన కుమార్తె మేధా సైతం తన తల్లి ఊహా బాటలోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మరి మేధా తన తల్లి ఊహ మాదిరిగానే ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇలా తమ అభిమాన నటుడు శ్రీకాంత్ కుమార్తె హీరోయిన్ గా రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈమెకు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ సినిమాపై బిగ్ అప్డేట్.. ఆ వార్తలకు చెక్ పెట్టారుగా!

Related News

లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ సినిమాపై బిగ్ అప్డేట్.. ఆ వార్తలకు చెక్ పెట్టారుగా!

స్నిగ్ధ లెస్బియనా కాదా? చివరకు అసలు విషయం చెప్పేసిందిగా!

బాలయ్య ఇల్లు కూల్చివేత.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు

నేను బ్రతికున్నంత వరకు నీ ఆత్మ నరకం అనుభవించాలి – తనుశ్రీ

పెళ్లి వద్దు.. పిల్లలు ముద్దు.. నరేష్ ఊహించని కామెంట్!

చిరంజీవి మూవీని వదులుకున్న బాలయ్య కూతురు!

తెరపై పద్ధతిగా.. నెట్టింట స్టైలిష్‌గా.. సురేఖా వాణి రూటే సెపరేటు!

Big Stories

Advertisement
×