E-Paper
Advertisement

మెుబైల్ పాస్‌వర్డ్ లేదా పాటర్న్ మర్చిపోయారా? ఆందోళన వద్దు.. ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేయండి!

మెుబైల్ పాస్‌వర్డ్ లేదా పాటర్న్ మర్చిపోయారా? ఆందోళన వద్దు.. ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేయండి!
Advertisement

Unlock Android Phone: అత్యవసర సమయాల్లో లేదా కొత్త పాస్‌వర్డ్, పాటర్న్ సెట్ చేసిన తర్వాత ఒక్కోసారి వాటిని మర్చిపోవడం సర్వసాధారణం. అలాగే ఇంట్లోని చిన్న పిల్లలు ఫోన్‌తో ఆడుతూ ఏదో ఒక పాస్‌వర్డ్ సెట్ చేసి, తర్వాత దాన్ని గుర్తుంచుకోలేకపోతుంటారు. దీంతో ఫోన్ లాక్ అయిపోయి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి కంగారు పడాల్సిన పనిలేదు. సర్వీస్ సెంటర్‌కు పరుగులు పెట్టకుండా ఇంట్లోనే సులభంగా ఎలా అన్‌లాక్ చేయాలో ఈ కథనంలో చూద్దాం.

గూగుల్ ‘ఫైండ్ మై డివైస్’

లాకైపోయిన ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివ్‌గా ఉంటే గూగుల్ ‘ఫైండ్ మై డివైస్’ (Find My Device) ఉపయోగించడం అత్యంత సులభమైన మార్గం. దీనికోసం వేరే ఫోన్ లేదా కంప్యూటర్‌లో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి google.com/android/find వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత లాకైన ఫోన్‌కు లింక్ అయి ఉన్న గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఫోన్ లొకేషన్, స్క్రీన్‌పై కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘ఎరేజ్ డివైస్’ (Erase Device) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియను కన్ఫర్మ్ చేయగానే లాక్ స్క్రీన్ సెట్టింగ్‌లతో సహా ఫోన్‌లోని డేటా పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ఫోన్ సరికొత్త డివైస్‌లా రీస్టార్ట్ అవుతుంది. అదే సమయంలో అన్‌లాక్ చేయబడుతుంది.

‘స్మార్ట్‌థింగ్స్ ఫైండ్’

Advertisement

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ‘స్మార్ట్‌థింగ్స్ ఫైండ్’ (SmartThings Find) ఎంతో ఉపయోగపడుతుంది. ఫోన్ లాకైపోయినప్పుడు ప్రత్యేకంగా పనిచేసే ఫీచర్ ఇది. దీన్ని ఉపయోగించడానికి వేరే డివైస్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి smartthingsfind.samsung.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ శాంసంగ్ అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత డ్యాష్‌బోర్డ్‌లో ‘అన్‌లాక్’ లేదా ‘ఎరేజ్ డేటా’ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. తగిన ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఇంటి నుంచే ఫోన్ లాక్ స్క్రీన్‌ను రిమూవ్ చేసి, తిరిగి ఫోన్‌ను వాడుకోవచ్చు.

ఫ్యాక్టరీ రీసెట్ బటన్

పైన పేర్కొన్న పద్ధతులు పనిచేయకపోయినా లేదా ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, ‘ఫ్యాక్టరీ రీసెట్’ (రికవరీ మోడ్) ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. అయితే ఈ పద్ధతిలో ఫోన్‌లోని డేటా అంతా పూర్తిగా డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. దీనికోసం ముందుగా ఫోన్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ తరువాత ‘పవర్ బటన్’, ‘వాల్యూమ్ డౌన్’ బటన్‌ను (కొన్ని మోడళ్లలో వాల్యూమ్ అప్) ఒకేసారి నొక్కి పట్టుకోవాలి. అప్పుడు రికవరీ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో టచ్ పనిచేయదు కాబట్టి, ఆప్షన్ల కోసం వాల్యూమ్ బటన్‌లను, ఎంచుకోవడానికి పవర్ బటన్‌ను ఉపయోగించాలి. మెనూలోని ‘వైప్ డేటా / ఫ్యాక్టరీ రీసెట్’ ఆప్షన్‌కు వెళ్లి దాన్ని ఎంచుకోవాలి. ఆపై ‘ఫ్యాక్టరీ డేటా రీసెట్’ను కన్ఫర్మ్ చేయాలి. కొద్ది నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఫార్మాట్ అయి స్క్రీన్ లాక్ ఓపెన్ అవుతుంది.

పాత స్మార్ట్‌ఫోన్‌ల కోసం..

Advertisement

ఒకవేళ చాలా పాత స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను ఉపయోగిస్తుంటే.. తప్పు పాటర్న్‌ను పదే పదే ఎంటర్ చేసినప్పుడు స్క్రీన్ క్రింది భాగంలో ‘ఫర్గెట్ పాటర్న్’ (Forgot pattern) ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి గూగుల్ అకౌంట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా సులభంగా ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.

Also Read: ఈఎంఐలు కట్టలేక అల్లాడుతున్నారా? ఈ 5 ట్రిక్స్ పాటిస్తే చాలు.. దెబ్బకు బయటపడతారు!

ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు జాగ్రత్త

ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్‌లతో సహా ఫోన్‌లో ఉన్న సమస్త డేటా శాశ్వతంగా తొలగిపోతుంది. రీసెట్ తర్వాత కేవలం గూగుల్ డ్రైవ్‌లో ముందుగా బ్యాకప్ చేసుకున్న డేటా మాత్రమే తిరిగి లభిస్తుంది. అలాగే సేఫ్టీ పరంగా మరో కీలకమైన విషయం ఏమిటంటే.. రీసెట్ పూర్తై ఫోన్ రీస్టార్ట్ అయిన తర్వాత లాక్ అయ్యే ముందు ఏ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయిఉందో అదే అకౌంట్ వివరాలు (ఐడీ, పాస్‌వర్డ్) ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లాగిన్ వివరాలు కచ్చితంగా గుర్తుండాలి.

Also Read: జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

Tags

Related News

జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!

థియేటర్లలను తలపించేలా హైసెన్స్ ఎల్ఈడీ టీవీలు..ఎగబడి కొంటున్న జనం

కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!

అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!

Big Stories

Advertisement
×