E-Paper
Advertisement

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సీపీఎం పార్టీ సై.. ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సీపీఎం పార్టీ సై.. ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్!
Advertisement

Graduate MLC: స్వేచ్చ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సీపీఎం సమాయత్తమవుతున్నది. ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తోంది.ఓటర్ల నమోదు ప్రక్రియకు ప్రాధాన్యమిస్తూ జిల్లా నాయకత్వాలకు బాధ్యతలు అప్పగించడం, లక్ష్యాలను నిర్దేశించినట్లు సమాచారం. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలి? రెండింటిలో పోటీకి నిలపాలా? లేకుంటే ఒక నియోజకవర్గంలో ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చి, మరో నియోజకవర్గంలో నిలిచి వారి మద్దతు కోరాలా? ఎలా ముందుకుపోవాలనేదానిపై నాలుగైదురోజుల్లో జరుగనున్న రాష్ట్ర కమిటీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దరఖాస్తుల ప్రక్రియ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందుగా అర్హులైన ఓటర్లను గుర్తించి, వారి పేర్లను జాబితాలో నమోదు చేయించడం కీలకం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీపీఎం ఓటర్ల నమోదు ప్రక్రియకు ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచారం. జిల్లా నాయకత్వాలు, స్థానిక పార్టీ శ్రేణులు ఈ దిశగా చొరవ తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. నమోదుకు అర్హులైన పట్టభద్రులను గుర్తించడం, వారికి అవసరమైన సమాచారం అందించడం, దరఖాస్తుల ప్రక్రియపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ప్రచారం చేయడమే కాకుండా…?

Advertisement

నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదు పురోగతిని పరిశీలిస్తూ, జిల్లాల నేతలకు లక్ష్యాలు నిర్దేశించే యోచనలో నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత హడావుడి పడటం కంటే ముందుగానే క్షేత్రస్థాయిలో పునాది బలోపేతం చేసుకోవడం ప్రయోజనకరమని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ప్రచారం చేయడమే కాకుండా, అంతకుముందే ఓటర్ల నమోదుపై దృష్టి పెడితేనే అనుకున్న ఫలితాలు సాధించవచ్చన్న భావనతో పార్టీ నాయకత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో ఉన్న అర్హులైన ఓటర్లను చేరుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Also read: ఈ ముగ్గురికి పొరపాటున కూడా సాయం చేయకండి..లేదంటే మీ జీవితమే నాశనం!

నల్లగొండపై గురి..

Advertisement

నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో రాజకీయ పరిస్థితులు, పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలం, ప్రజాసంఘాల మద్దతు వంటి అంశాలను సీపీఎం పరిశీలిస్తున్నది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం. స్థానికంగా పార్టీకి ఉన్న నిర్మాణం, కార్యకర్తల బలం, పట్టభద్రుల్లో ఉన్న పరిచయాలు, వామపక్ష భావజాలానికి అనుకూలంగా ఉన్న సంఘాల మద్దతు వంటి అంశాలు అభ్యర్థి ఎంపికలో కీలకంగా మారనున్నాయి. ఈ మూడు జిల్లాల్లో వామపక్ష పార్టీలకు కేడర్ కు ఉంది. ఈ కేడర్ ను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తుంది. అందుకే పోటీ చేసి సత్తాచాటాలని, పార్టీ శ్రేణుల్లో సైతం జోష్ నింపాలని, కేడర్ ను సైతం యాక్టీవ్ చేయాలని వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. మరో నిజామాబాద్-రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానం నుంచి సైతం పోటీ చేస్తే ఎలా ఉంటుందనేదానిపైనా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే రెండు స్థానాల కంటే ఒకే స్థానం నల్లగొండపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సీపీఐతో కలిసి వెళ్లేనా?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వామపక్షాల ఐక్యత మరో కీలక అంశంగా మారనుంది. సీపీఎంతో పాటు సీపీఐ కూడా ఎన్నికలపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీపీఎం నేతలు సీపీఐ నేతలతో సంప్రదింపులు జరిపారనే చర్చజరుగుతుంది. అందుకు సంబంధించిన వివరాలు మాత్రం ప్రకటించలేదు. మరోసారి భేటీ అయిన తర్వాతరాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వామపక్ష పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం కంటే పరస్పర అవగాహనతో ముందుకెళ్తే ఓట్ల చీలికను తగ్గించుకోవచ్చన్న అభిప్రాయం కూడా పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీలు కలిసిఉమ్మడి అభ్యర్థిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా?అనేది కూడా రాజకీయ చర్చజరుగుతుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తో సీపీఐ కలిసిపోతున్న ఘటనలు ఉన్నాయి. ఈ తరుణంలో సీపీఎం, సీపీఐలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసిపోతాయా? అనేది కూడా చర్చకుదారితీసింది.

మద్దతు కోసం సంఘాల ప్రయత్నాలు?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులకు వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యావంతుల వేదికలు, రాజకీయ పార్టీలు మద్దతు కూడగట్టడం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంఘాలు, పార్టీలు సీపీఎంమద్దతు కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా సంఘాల డిమాండ్లు, రాజకీయ ప్రాధాన్యాలు, అభ్యర్థులపై వాటి అభిప్రాయాలు ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది.సీపీఎం అభ్యర్థిని ప్రకటిస్తే ఆయా సంఘాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్న సంఘాలు ఏ మేరకు సహకరిస్తాయి? ఇతర ప్రజాస్వామిక శక్తులతో కలిసి పనిచేసే అవకాశం ఉందా? అన్నది రాజకీయంగా చర్చనీయాంశమైంది.

నాలుగైదు రోజుల్లో రాష్ట్ర కమిటీ భేటీ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ వైఖరిని ఖరారు చేసేందుకు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం త్వరలో జరగనున్నట్లు సమాచారం. నాలుగైదు రోజుల్లో జరిగే ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అంశంతో పాటు అభ్యర్థి ఎంపిక, ఇతర వామపక్ష పార్టీలతో సమన్వయం, ప్రజాసంఘాల మద్దతు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.క్షేత్రస్థాయి పరిస్థితులు, ఓటర్ల నమోదు పురోగతి, పార్టీకి ఉన్న బలం, అందుబాటులో ఉన్న నాయకుల పేర్లను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సీపీఎంకు రాజకీయంగా తమ ఉనికిని చాటుకునే అవకాశం ఉంది. అందుకే పార్టీ రాష్ట్ర కమిటీ పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ సీపీఎం పోటీ అంశం మాత్రం రాజకీయంగా చర్చకుదారితీసింది.

Also read: మీ ఉరిలో భూమి రీ-సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా.. పూర్తి షెడ్యుల్ ఇదే?

Tags

Related News

బీజేపీలో బతుకమ్మ రాజకీయ మంటలు.. మరోసారి భగ్గుమన్న నేతల ఆధిపత్య పోరు!

నంబర్ ప్లేట్లు లేని కార్లతో ఆర్టీఓ అధికారుల తనిఖీలు.. దీనికి మతలబేంటో..?

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

మీ ఉరిలో భూమి రీ-సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా.. పూర్తి షెడ్యుల్ ఇదే?

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

సిరిసిల్ల సభ చేదు అనుభవం తనకూ కలగకుండా… ముందే అప్రమత్తమైన వైనం… సిద్దిపేట సభతో బల ప్రదర్శన..!

Big Stories

Advertisement
×