BigTV English

CM Revanth Reddy: ఫ్యూచర్ AIదే.. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ ఇదొక మైలురాయి – సీఎం రేవంత్

CM Revanth Reddy: ఫ్యూచర్ AIదే.. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ ఇదొక మైలురాయి – సీఎం రేవంత్

CM Revanth Reddy: భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. హైదరాబాద్ లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించడం మనందరికీ గర్వకారణమన్నారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయిగా వర్ణించారు.


మైక్రోసాఫ్ట్-హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు ముఖ్యమంత్రి. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. మీరు హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని వివరించారు. మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్లు తెలిపారు సీఎం. మైక్రోసాఫ్ట్- తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీతో కూడిన ADVANTA(I) GE TELANGANA ను ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నామని గుర్తు చేశారు.


ఈ భాగస్వామ్యంతో తెలంగాణలో మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నాయని తెలిపారు. ఈ పెట్టుబడి మా స్టార్టప్ ఎకో సిస్టమ్ బలోపేతం చేయడంతోపాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్ ను ఇస్తుందన్నారు.

ALSO READ:  బీఆర్ఎస్‌కు మంత్రి పొన్నం కౌంటర్.. దేశానికి రోల్ మోడల్

మా ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందన్నారు.

తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆవిష్కరణల పట్ల మీ నిబద్ధత మా తెలంగాణ రైజింగ్ విజన్‌కు తోడవుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించింది. గచ్చిబౌలిలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించింది. అందులో 2,500 మంది ఉద్యోగులకు సరిపడే సదుపాయాలున్నాయి. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది. వీటిద్వారా దాదాపు 50 వేల మందికి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కాకుండా ఏఐ-ఇండస్ట్రీ ప్రో పేరుతో మరో కార్యక్రమాన్ని చేపడుతుంది. రాష్ట్రమంతటా 20,000 మంది పరిశ్రమల నిపుణులకు నైపుణ్యాలను నేర్పించనుంది. దీనికితోడు AI-గవర్న్ ఇనీషియేటివ్ పేరుతో రాష్ట్రంలోని దాదాపు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు AI, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి కీలకమైన రంగాలలో శిక్షణ ఇవ్వనుంది.

తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో AI సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ స్థాపించనుంది. AI నాలెడ్జ్ హబ్‌తో పాటు AI అభివృద్ధికి క్లౌడ్-ఆధారిత మౌలిక సదుపాయాలు ఇందులో ఉంటాయి. రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులకు ఉపయోగపడేలా రీసేర్చీ, కేస్ స్టడీస్, ఉత్తమ పరిశోధన పద్ధతులు అందుబాటులో ఉంచుతుంది.అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో హైపర్‌ స్కేల్ AI డేటా సెంటర్లలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

రాబోయే సంవత్సరాల్లో వీటికి అదనంగా రూ. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు అతిపెద్ద డేటా హబ్‌ గా అవతరించనుంది. ఈ ప్రణాళికలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ కంపెనీ -రేవంత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×