BigTV English

Mahindra SUV Discounts: హాట్ హాట్ సమ్మర్‌లో.. కూల్ ఆఫర్స్: మహీంద్రా కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు..!

Mahindra SUV Discounts: హాట్ హాట్ సమ్మర్‌లో.. కూల్ ఆఫర్స్: మహీంద్రా కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు..!

Mahindra XUV300 discount: మంచి డిస్కౌంట్‌తో అద్భుతమైన కార్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఓ గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెల (మే)లో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. XUV400 EV, XUV300, XUV700, స్కార్పియో-ఎన్‌, బొలెరో, బొలెరో నియో, మొరాజో వంటి మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. అయితే వీటన్నింటిలో మహీంద్రా XUV300 పై ఊహించని డిస్కౌంట్‌ను అందిస్తుంది.


మహీంద్రా XUV300 (Mahindra XUV300)

మహీంద్రా కంపెనీ మహీంద్రా XUV300 మోడల్ కొనుగోలుపై ఏకంగా రూ.1.79 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఇది మొత్తం నగదు రూపంలో కాకుండా.. కొంత క్యాష్ డిస్కౌంట్, అఫీషియల్ యాక్ససరీస్, ఎక్స్టెండెడ్ వారెంట్ మొదలైన రూపంలో అందుతుంది. కాగా ఇందులో టాప్ స్పెక్ XUV300 W8 డీజిల్ వేరియంట్‌పై గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయి.


W8 పెట్రోల్ ట్రిమ్‌లు రూ. 1.59 లక్షల వరకు తగ్గింపును పొందుతాయి. అలాగే W6, W4, W2 వంటి వేరియంట్‌లు కూడా రూ. 45,000 నుండి రూ. 1.33 లక్షల వరకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను పొందుతాయి. XUV300 ఐదు పవర్‌ట్రైన్ ఎంపికలను అందిస్తుంది.

Also Read : మైండ్ బ్లోయింగ్ కలర్‌తో మహీంద్రా బ్లేజ్ ఎడిషన్‌.. ధర ఎంతంటే..?

మహీంద్రా XUV400 EV (Mahindra XUV400 EV)

మహీంద్రా XUV400 EV(ఎలక్ట్రిక్ వెహికల్) 2023 మోడల్‌పై సుమారు రూ.4.4 లక్షల వరకు భారీ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేటెడ్ మోడల్‌ మీద కూడా కొంత డిస్కౌంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న వేరియంట్, ఛార్జింగ్ కెపాసిటీ, బ్యాటరీ ప్యాక్ వంటి వాటిమీద ఆధారపడి పనిచేస్తుంది. అందువల్ల ఈ నెలలో కారు కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఇదే మంచి ఛాన్స్. XUV400 చిన్న బ్యాటరీకి 375కిమీ.. పెద్ద బ్యాటరీకి 456కిమీల పరిధిని అందిస్తుంది.

మహీంద్రా XUV700 (Mahindra XUV700)

మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మహీంద్రా XUV700 ఒకటి. ఇప్పుడు ఈ కారుపై సూపర్ డూపర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ కారు 2023 మోడల్‌పై ఏకంగా రూ.1.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఏడాది మోడల్‌పై ఎలాంటి డిస్కౌంట్ లేదు. మాన్యువల్, ఆటోమేటిక్ రూపంలో అందుబాటులో ఉన్న ఏఎక్స్5 7-సీటర్ డీజిల్, ఏఎక్స్5 7-సీటర్ పెట్రోల్ మ్యాన్యువల్ మినహా మిగతా అన్ని వేరియంట్లపై అద్భుతమైన డిస్కౌంట్లు పొందొచ్చు.

మహీంద్రా స్కార్పియో-N (Mahindra Scorpio-N)

మహీంద్రా స్కార్పియో-Nపై కూడా అదిరిపోయే డిస్కౌంట్లు పొందొచ్చు. 2023 Scorpio-N మోడల్‌లు 4WDతో టాప్-స్పెక్ Z8, Z8L డీజిల్ వేరియంట్‌లకు మాత్రమే రూ. 1 లక్ష నగదు తగ్గింపును అందజేస్తున్నాయి. 2024 Scorpio-Nలో ఎలాంటి ప్రయోజనాలు అందించబడవు. 2024 RWD పెట్రోల్, డీజిల్ రూపంలో జెడ్ 8, జెడ్ 8ఎల్ పై రూ.60,000 వరకు తగ్గింపును పొందొచ్చు.

Also Read : ఈ మహీంద్రా కారు కొనుగోలుపై ఏకంగా రూ.1.50 లక్షల డిస్కౌంట్.. చివరి తేదీ ఇదే!

మహీంద్రా మరాజో (Mahindra Marazzo)

మహీంద్రా మొరాజోలో మూడు వేరియంట్లు (ఎం2, ఎం4 ప్లస్, ఎం6 ప్లస్) ల పై మే నెలలో రూ.93,200 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ.20000 విలువైన యాక్ససరీస్ డిస్కౌంట్, కార్పొరేట్ వంటి డిస్కౌంట్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)

మహీంద్రా బొలెరో నియో ల్యాడర్ ఫ్రేమ్ 7-సీటర్ వేరియంట్‌పై రూ.83,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, యాక్ససరీస్ వంటివి లభిస్తాయి. అలాగే బొలెరో నియో మిడ్ స్పెక్ ఎన్8 పై రూ.64,000, ఎంట్రీ లెవెల్ ఎన్4పై రూ.56,000 తగ్గింపు పొందొచ్చు.

మహీంద్రా బొలెరో (Mahindra Bolero)

మహీంద్రా బొలెరో మోడల్‌పై ఏకంగా రూ.82,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, యాక్ససరీ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. మిడ్ స్పెక్ B6పై రూ.48,000, ఎంట్రీ లెవెల్ బి4పై రూ.61,000 డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్లన్నీ ఈ నెల వరకు మాత్రమే వర్తిస్తాయి.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×