IDBI Bank Strike: బ్యాంకును విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. నవంబర్ 2, 3 సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి ఆ శాఖ బ్యాంకు ఓపెన్ చేయకపోవడంతో వినియోగదారులు షాకయ్యారు. పరిస్థితి గమనించిన ఐడీబీఐ బ్యాంకు.. ఓ ప్రకటన జారీ చేసింది.
ఐడీబీఐ బ్యాంక్‌ను విదేశీ కంపెనీకి విక్రయించాన్ని నిరసిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. నవంబర్ 2 అంటే సోమ, మంగళవారాల్లో దేశ వ్యాప్తంగా ఆ బ్యాంక్ శాఖ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీనికి ఐడీబీఐ బ్యాంక్ ఆఫీసర్స్- ఎంప్లాయీస్ యూనియన్లు పిలుపు ఇచ్చాయి. సోమవారం ఆ బ్యాంకు ఓపెన్ కాకపోవడంతో ఖాతాదారులు తర్జనభర్జన పడ్డారు. పరిస్థితి గమనించిన ఐడీబీఐ బ్యాంక్.. తమ ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. ఖాతాదారుల ఇబ్బందులను తొలగించేందుకు బ్యాంక్ యాజమాన్యం కస్టమర్ అడ్వైజరీ జారీ చేసింది.
సమ్మె జరగనున్న రెండు రోజులు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు. డిజిటల్ నెట్‌వర్క్ అంతా యథావిధిగా పని చేస్తుందని పేర్కొంది. ఉన్నట్లుండి ఆ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడం వెనుక కారణాలను చూద్దాం. ఈ బ్యాంకులో ప్రభుత్వం- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LICకి ఉమ్మడిగా 60 శాతం వాటా పైగానే ఉంది. ఆ వాటాను కెనడియన్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించాలని ప్రభుత్వ డిసైడ్ అయ్యింది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ IDBI బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ యూనియన్లు సమ్మెకు దిగాయి. యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్.. ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటించింది. ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు బ్యాంకు మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది ఐడీబీఐ బ్యాంకు. నిధుల బదిలీ సేవలు నిరంతరాయంగా పని చేస్తాయని తెలియజేసింది.
ALSO READ: శాలరీ అకౌంట్ vs సేవింగ్స్ అకౌంట్.. రెండింటికీ తేడా ఏంటి? ఏ ఖాతా వల్ల ఎక్కువ లాభం?
గ్రామీణ, సెమీ- అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, బీఎన్ఏ మిషన్లు అందుబాటులో ఉంటాయని సదరు బ్యాంకు పేర్కొంది. డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్ వాటిపై ఆధారపడే పనులను నవంబర్ 4 వరకు వాయిదా వేసుకోవడం బెటర్. ఛార్జీలు లేకుండా ఉచితంగా సేవల నేపథ్యంలో ఇతర బ్యాంక్ ఏటీఎంలను ఉపయోగించుకోవడం మంచిదని పలువు కస్టమర్లు చెబుతున్నారు.