E-Paper
Advertisement

నెల జీతం సరిపోవడం లేదు.. ధరల పెరుగుదలతో విలవిల్లాడుతున్న 70 శాతం భారతీయులు

నెల జీతం సరిపోవడం లేదు.. ధరల పెరుగుదలతో విలవిల్లాడుతున్న 70 శాతం భారతీయులు
Advertisement

Salary Growth vs Inflation| నెల జీతం ప్రతి ఏడాది పెరుగుతున్నా చేతిలో డబ్బు మాత్రం మిగలడం లేదా? ఇంటి అద్దె, నిత్యావసర వస్తువులు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు పెరుగుతుండటంతో చాలామంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతం పెరిగినా ఖర్చులకు సరిపోవడం లేదని భారతీయుల్లో ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. గ్రాంట్ థార్న్టన్ భారత్ అనే ఫైనాన్స్, ట్యాక్స్ అడ్వైజరీ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఈ పరిస్థితిని వెల్లడించింది. ముఖ్యంగా యువ ఉద్యోగుల్లో ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంది.

వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్లు జీతాలు పెరగడం లేదు

గ్రాంట్ థార్న్టన్ భారత్ విడుదల చేసిన ‘ఇండియాస్ ఫైనాన్షియల్ రెసిలియెన్స్ రిపోర్ట్ 2026’ ప్రకారం.. 62 శాతం మంది తమ ఆదాయం భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోలేదని భావిస్తున్నారు. ముఖ్యంగా యువతలో అంటే 25 నుంచి 34 ఏళ్ల వయసున్న వారిలో 70 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. న్న నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టైర్ 2 నగరాల్లో 71 శాతం మంది, టైర్ 3 నగరాల్లో 70 శాతం మంది జీతాల పెరుగుదల సరిపోవడం లేదని చెప్పారు. టైర్ 1 నగరాల్లో ఈ సంఖ్య 61 శాతంగా ఉంది.
ఇంటి అద్దెలు, విద్య, వైద్య ఖర్చులు పెరగడం వల్ల మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోందని గ్రాంట్ థార్న్టన్ భారత్ భాగస్వామి రామ్‌కుమార్ సుబ్రమణియన్ తెలిపారు. జీతాలు పెరుగుతున్నా జీవన ప్రమాణాలను కొనసాగించడం కష్టమవుతోందని ఆయన వివరించారు.

ఎక్కువ మంది ఉద్యోగుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపే

Advertisement

ఈ నివేదిక కోసం 2025 నవంబర్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య 528 మంది నుంచి సమాధానాలు సేకరించారు. వీరిలో 58 శాతం మంది వార్షికంగా రూ.15 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. 30 శాతం మంది రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు సంపాదిస్తున్నారు. కేవలం 12 శాతం మందికి మాత్రమే రూ.40 లక్షలకు పైగా ఆదాయం ఉంది. 62 శాతం మందికి ఏడాదికి 4 నుంచి 12 శాతం మధ్య జీతాలు పెరుగుతున్నాయి. 6 శాతం మందికి మాత్రమే 20 శాతానికి మించి పెరుగుదల నమోదైంది. 34 ఏళ్లలోపు ఉద్యోగుల్లో 77 శాతం మంది రూ.15 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్నారు.
తమ నైపుణ్యాలకు తగిన జీతం రావడం లేదని 82 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమ ఉద్యోగ రంగంలో నిపుణులమని భావిస్తున్న వారిలోనూ 85 శాతం మంది తక్కువ జీతం పొందుతున్నామని చెప్పారు.

Also Read: తొలిసారి డేట్‌కు వెళుతున్నారా? సినిమా వెళ్లడం కంటే ఈ 7 పనులు చేయండి

కుటుంబ బాధ్యతలతో పొదుపు చేయడం కష్టం

Advertisement

సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది కనీసం ఒక కుటుంబ సభ్యుడికి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. 32 శాతం మంది కుటుంబాలకు వారే ఏకైక సంపాదనపరులుగా ఉన్నారు. పురుషుల్లో 41 శాతం మంది కుటుంబానికి ఏకైక సంపాదనపరులుగా ఉన్నారు. మహిళల్లో ఈ సంఖ్య 15 శాతంగా ఉంది. మరోవైపు, 44 శాతం మంది అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. 29 శాతం మంది జాయింట్ ఫ్యామిలీతో సొంత ఇళ్లలో, 27 శాతం మంది తమ సొంత ఇళ్లలో ఉంటున్నారు.

Also Read: భర్త సంపాదన నెలకు రూ.3 లక్షలు, రూ.1.7కోట్ల హోమ్ లోన్.. భార్యకు ప్రతినెలా రూ.2 లక్షలు చెల్లించాలన్న కోర్టు

అత్యవసర పొదుపులు, రిటైర్మెంట్ ప్రణాళికపై ఆందోళన

84 శాతం మందికి అత్యవసర సమయం కోసం కొంతమేర సేవింగ్స్ ఉన్నాయి. అయితే, ఆదాయం ఆగిపోతే 83 శాతం మందికి ఏడాది కూడా ఆ సేవింగ్స్ సరిపోవని నివేదిక వెల్లడించింది.

రిటైర్మెంట్ విషయంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 83 శాతం మంది తమ పదవీ విరమణ కోసం తగిన ఆర్థిక ఏర్పాట్లు చేసుకోలేదని చెప్పారు. 34 ఏళ్లలోపు వారిలో ఈ సంఖ్య 92 శాతంగా ఉంది. 35 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 77 శాతం మంది కూడా రిటైర్మెంట్‌కు సిద్ధంగా లేరు.

ఈ నివేదిక భారతీయ ఉద్యోగులపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడిని స్పష్టం చేస్తోంది. జీతం పెరుగుదలతో పాటు పొదుపు, పెట్టుబడులు, రిటైర్మెంట్ ప్రణాళికపై కూడా ఉద్యోగులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Related News

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లు మాయం.. మీ డబ్బులు పోతే వెంటనే ఈ 5 పనులు చేయండి

చదువు మధ్యలోనే ఆపేసి రోజుకు రూ.100 కూలీ పని చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2 లక్ష కోట్ల బిజినెస్‌కు అధిపతి

దీపావళి వేళ సిఎంఆర్ జ్యువెలరీ ఆఫర్లు.. బంగారు ఆభరణాలపై భారీగా డిస్కౌంట్లు!

సామాన్యులకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు.. త్వరలోనే రూ.లక్ష దిగువకు పసిడి?

నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తే.. కంపెనీపై కోర్టులో కేసు వేయవచ్చా?

ఒకే చోట 500+ ప్రాజెక్ట్‌లు, స్పాట్ లోనే బ్యాంక్ లోన్లు.. హైటెక్స్‌లో నరెడ్కో ప్రాపర్టీ షో మిస్ కావద్దు

రూ.10 వేల జీతం తీసుకునే ఉద్యోగి.. కట్ చేస్తే ఖాతాలో రూ.10 వేల కోట్లు.. చివరికి ఏమైందంటే!

Big Stories

Advertisement
×