Comedian Dhanraj: ధనాధన్ ధన్ రాజ్ (Dhanaraj).. ఈ పేరు చెప్పగానే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ధనరాజ్ పేరుకి ధనాధన్ అనే ట్యాగ్ ఉంటేనే ఆయన పేరుకు పరిపూర్ణత వస్తుంది. ఎందుకంటే ఈ ట్యాగ్ ద్వారా అంత ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి కమెడియన్లలో ధనరాజ్ కూడా ఒకరు. జబర్దస్త్ (Jabardasth) ద్వారా వచ్చిన పాపులారిటీతో ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు అందుకున్నారు. అలాగే ఓ సినిమా నిర్మించి నిర్మాతగా కూడా మారారు.అయితే అలాంటి ధనరాజ్ కమెడియన్ గా మెప్పించినప్పటికీ సినిమా నిర్మించి డబ్బు నష్టపోయాను అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడ్డారు.మరి ఇంతకీ ధనరాజ్ నిర్మాతగా మారి ఎంత డబ్బు నష్టపోయారు అనేది ఇప్పుడు చూద్దాం..
సినిమా తీసి భారీగా నష్టపోయిన ధనరాజ్..
ధనరాజ్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”ధనలక్ష్మి తలుపు తడితే” సినిమా కారణంగా ఎన్ని లక్షలు నష్టపోయారో చెప్పారు.. ఆయన మాట్లాడుతూ.. ధనలక్ష్మి తలుపు తడితే సినిమా (DhanalakshmiThalupu Tadithe Movie) కి నిర్మాతగా చేసి దాదాపు రూ.80 లక్షల వరకూ నష్టపోయాం. ఫ్రెండ్స్ అంతా కలిపి ఈ బడ్జెట్ పెట్టాం.అందులో నేను రూ.40 లక్షల నష్టపోయాను. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో కొన్ని ఈవెంట్స్ అలాగే షాప్ ఓపెనింగ్స్ కి వెళ్లి కొంత డబ్బు సంపాదించాను. ఆ డబ్బుతో సినిమాని నిర్మించి భారీ హిట్టు కొట్టాలని చూస్తే, చివరికి ఆ సినిమా వల్ల భారీ లాస్ అయింది. దాని వల్ల రూ.40 లక్షలు కోల్పోయాను” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే జబర్దస్త్ గురించి మాట్లాడుతూ.. “చిన్న చిన్న ఈవెంట్స్ లో మమ్మల్ని చూసిన మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి(Syam prasad Reddy) ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ షో చేద్దామని జబర్దస్త్ స్టార్ట్ చేశారు. ఇక జబర్దస్త్ స్టేజ్ మీద ఫస్ట్ షార్ట్ నా మీదే తీశారు.. అలాగే ఫస్ట్ స్కిట్ కొట్టింది కూడా నేనే.. ఇక అప్పట్లో నేనే.. చమ్మక్ చంద్ర,వేణు వంటి ఎంతో మందిని ఈ షో కోసం తీసుకువచ్చాను. వాళ్లు ఇప్పుడు ఎంతోమంచి పొజిషన్లో ఉన్నారు.జబర్దస్త్ (Jabardasth) ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన వారిలో దాదాపు 50% మంది ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్నారు. ఇక జబర్దస్త్ లో నాగబాబు (Nagababu) నవ్వుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయన హార్ట్ ఫుల్ గా నవ్వుతారు. ఆయన తర్వాత రోజా (Roja) గారు కూడా..ఇక జబర్దస్త్ ద్వారా అనసూయ(Anasuya) , రష్మీ(Rashmi ) లు కూడా ఫేమస్ అయ్యారు.కానీ ఇప్పుడు నేను జబర్దస్త్ చూడడం మానేశాను” అంటూ ధనరాజ్ చెప్పుకొచ్చారు.
సాయి అచ్యుత్ డైరెక్షన్లో మూవీ..
ఇక ధనరాజ్ ధనలక్ష్మి తలుపు తడితే సినిమా కంటే ముందే ఓ చచ్చినోడి ప్రేమ కథ అనే సినిమాతో సాయి అచ్యుత్ ని ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకున్నారు. అయితే ఆ సినిమాకి బడ్జెట్ పెట్టే స్థాయిలో ధనరాజ్ అప్పుడు లేరట. దాంతో ఈ సినిమా కి బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలను కలిసినప్పటికీ వాళ్ళు ముందుకు రాలేదు. దాంతో కొద్దిరోజులయ్యాక మళ్ళీ అదే డైరెక్టర్ సాయి అచ్యుత్ (Sai Achyuth) ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాని నిర్మించినప్పటికీ ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మొత్తానికైతే ఆశకు పోయి భారీ నష్టాన్ని చవిచూసాడు ధనరాజ్ అని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.