BigTV English

India – US : భారత్‌పై రివేంజ్.. ట్రంప్ సంచలన నిర్ణయం

India – US : భారత్‌పై రివేంజ్.. ట్రంప్ సంచలన నిర్ణయం

India – US : తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే. అది మన ఊరైనా.. అగ్రరాజ్యం అమెరికానైనా. మోదీ, ట్రంప్ మంచి దోస్తులు. కలుస్తారు. కౌగిలించుకుంటారు. కలిసి భోజనాలు చేస్తారు. ఒకరినొకరు తెగ పొగిడేసుకుంటారు. చూసే వాళ్లకు ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటారు. ఇంకేం రెండు దేశాల అధ్యక్షులు ఇంత క్లోజ్‌గా ఉంటే.. ఇక ఇండియాకు తిరుగేం ఉంటుంది? కానీ… అంత సీన్ లేదు. ట్రంప్ మహా తింగరోడు. టక్కరిమారి పనులు చేస్తుంటాడు. అమెరికాను భారత్ దోచుకుంటోందని అంటున్నాడు. యూఎస్ వస్తువులపై ఇండియా భారీ పన్నులు వసూలు చేస్తోందని మండిపడుతున్నాడు. బదులుగా.. మన ఎగుమతులపై విచ్చలవిడిగా సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఇల్లీగల్ అంటూ వందలాది మంది ఇండియన్స్‌ను ఆర్మీ విమానాల్లో భారత్‌కు తిరిగిపంపించేశాడు. ఇప్పుడిక మనపై పన్నులు బాదే పని స్టార్ట్ చేస్తున్నాడు. అదే జరిగితే.. ఇండియా – అమెరికా వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. మన ఎక్స్‌పోర్ట్స్‌ కుప్పకూలడం పక్కా.


పన్నుల బాదుడు షురూ..

దెబ్బకు దెబ్బ తీస్తాం.. మాపైన ఎంత టారిఫ్‌ వేస్తే.. మేమూ అంతే వేస్తాం.. ఇప్పుడు ఇదే బాటలో వెళుతుంది అమెరికా. అమెరికా టారీఫ్‌ కొరడా విధిలిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఆయన కీలక ప్రకటన చేసే ముందు దీనిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ కీలక వ్యాఖ్యలు చేశారు.


అమెరికాను పన్నులతో దోచుకుంటున్నారా?

అమెరికాను అనేక దేశాలు దోచుకుంటున్నాయి. అందులో మెక్సికో, కెనడా, భారత్, చైనాలు ఉన్నాయి. భారత్ అయితే వందశాతం టారిఫ్‌లను విధిస్తుంది.. ఇకపై తాము చూస్తూ ఊరుకోం.. ప్రతీకార సుంకాలు విధిస్తామని తేల్చి చెబుతున్నారు కరోలిన్. పన్నుల విధింపుపై ఏప్రిల్ 2న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం ప్రకటిస్తారని స్పష్టం చేశారామె. ఇతర దేశాల సుంకాల వల్ల అమెరికా ఎగుమతులు దెబ్బ తిన్నాయని అన్నారు. అందుకే రివేంజ్ ట్యాక్స్‌లు ఇంపోజ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైమ్ అంటూ చెప్పుకొచ్చారు.

ఏ దేశం ఎంత పన్ను అంటే..

అమెరికా డెయిరీ ఉత్పత్తులపై యూరప్ 50 శాతం.. అమెరికా బియ్యంపై జపాన్ 700 శాతం.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం.. అమెరికా బటర్, చీజ్‌పై కెనడా 300 శాతం.. ఇవీ అమెరికాపై ఇతర దేశాలు విధిస్తున్న టారీఫ్‌లు అని చెబుతున్నారు కరోలినా. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. అందుకే ప్రతీకార సుంకాలు విధించక తప్పదన్నారు. అమెరికా ప్రజల క్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామని.. ఏప్రిల్ 2 నుంచి సుంకాల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read : ప్రవీణ్ పగడాల కేసులో అసలు నిజాలు..

ట్రంప్ వార్నింగ్‌లు… కరోలినా వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే టారిఫ్‌ల బాంబు గట్టిగానే పేలడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్ కూడా చరిత్రాత్మక మార్పును తీసుకురాబోతున్నారని చెబుతున్నారు కరోలినా.

వాణిజ్య పాలసీల మేటర్‌లో అమెరికా మిత్ర దేశాలు.. శత్రు దేశాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతున్నారు. ఇకపై ఇలాంటివి ఉపేక్షించబోనని అన్నారు. ఏప్రిల్ 2న ప్రతీకార పన్నుల టారిఫ్‌లను ట్రంప్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ నిర్ణయం అమెరికాకు గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు ట్రంప్.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×