Today Gold Price: రోజుకి రోజుకి బంగారం ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.90 వేలకు చేరువలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. అయితే గత రెండు, మూడు రోజుల క్రితం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టిన ఈరోజు (ఫిబ్రవరి 28) మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ.500 పెరిగి, రూ. 79,600కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.540 పెరిగి, 86,840 వద్ద కొనసాగుతోంది.
అయితే ఇంతలా బంగారం పెరగడానికి కారణం.. అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధమే దీనికి కారణం అని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు రూపాయి వాల్యూ కూడా పడిపోవడమే మరొక కారణం అని చెబుతున్నారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధ కారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలు పెరిగేందుకు కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక వివధ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్ధాం.
ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,750కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 990 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 840 పలుకుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,600 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86, 840కి చేరుకుంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 840 పలుకుతోంది.
కేరళ, కోల్‌కత్తా ఇతర పట్టణ నగరాల్లో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,750 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 840 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 840పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,750 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 840 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 840 పలుకుతోంది.
Also Read: పనిగంటలు కాదు.. ఫలితాలు ముఖ్యం.. వారానికి ఐదు రోజులు చాలు.. టెక్ కంపెనీ సీఈఓ
వెండి ధరలు పరిశీలిస్తే..
గోల్డ్ రేట్స్ రోజు రోజుకి పరుగులు పెడుతున్న వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు హైదరబాద్, వైజాగ్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,05,000కి చేరుకుంది.
బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.97,000 వద్ద కొనసాగుతోంది.