PSL – IPL: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పాకిస్తాన్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్… రెండు మ్యాచులు ఆడి ఎలిమినేట్ అయిపోయింది. గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ ఓడిపోవడం… అక్కడి అభిమానులు జీర్ణించుకోవడం లేదు. అయితే… ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్ జట్టు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 10 షెడ్యూల్ ను తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విలన్ గా మారేలా కనిపిస్తోంది. అతి తక్కువ మంది చూసే ఈ సూపర్ లీగ్ కు… విదేశీ అభిమానులు దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ జరుగుతున్న సమయంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కూడా జరగబోతుంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10వ తేదీ నుంచి మే 18 వ తేదీ మధ్య మ్యాచులు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ లో ఆరు జట్లు పాల్గొననుండగా… 35 మ్యాచులు జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పూర్తయిన వెంటనే పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో పాకిస్తాన్ సూపర్ లీగ్ జరిగేది. పాకిస్తాన్ సూపర్ లీగ్ పూర్తయిన తర్వాతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫిబ్రవరి, మార్చి నెలలోనే… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ వచ్చింది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లేకపోయి ఉంటే… ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం అయ్యేది. అంటే ఈసారి జరిగే పాకిస్తాన్ సూపర్ కాస్త ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. మార్చి 22వ తేదీ నుంచి 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.
మార్చి 22వ తేదీ నుంచి మే 25 తేదీ వరకు… ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. ఇదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్… జరగడం చూడబోతున్నాం. వాస్తవానికి పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో పెద్ద స్టార్ ఎవరు ఉండరు. కేవలం పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో అయితే.. ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్, ఐపిఎల్ 2025 టోర్నమెంట్ ఒకేసారి జరిగితే… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఎక్కువ శాతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చూస్తారు జనాలు. అంతర్జాతీయంగా కూడా పి ఎస్ ఎల్ కంటే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ఆదరణ ఎక్కువ. విదేశాభిమానులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చూసి ఎంజాయ్ చేసే ఛాన్సులు ఉంటాయి. ఒకవేళ ఇదే జరిగితే…. పాకిస్తాన్ బోర్డు కు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన పాకిస్తాన్ కు ఇప్పుడు వ్యూయర్ షిప్ ప్రకారం దెబ్బ పడనుంది.