Sandeepa Virk: రామ్‌చరణ్ ‘ధృవ’సినిమాను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ ఫాలో అయ్యిందా? తన ఆలోచనను పెట్టుబడిగా మార్చకుందా? చివరకు ఈడీకి ఇచ్చిందా? ఆ స్థాయిలో ఆమె చేసిన తప్పేంటి? తన గ్లామర్‌ను బిజినెస్‌గా మార్చుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
సందీపా విర్క్ గురించి సోషల్ మీడియా వ్యక్తులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆమె. నటిగా, బిజినెస్ మేన్‌గా పరిచయం చేసుకుంది. ఒకరు ఇద్దరు ఏకంగా ఆమెని 12 లక్షల మంది ఫాలో అవుతారు. ఇన్‌స్టాగ్రామ్ ఓ వెలుగు వెలిగిని ఆమెని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
రూ.40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టింది. తప్పుడు వాగ్దానాలు, నకిలీ బ్యూటీ ఉత్పత్తులతో మోసం చేసి ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో అరెస్టు అయ్యింది.
మొహాలీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ, గడిచిన రెండు రోజులుగా ఢిల్లీ, ముంబై నగరాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆమె వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ALSO READ: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. కొత్త రూల్స్, ఆపై ఛార్జీల మోత
సందీపా విర్క్ ఓ వెబ్ పోర్టరల్ (hyboocare.com)ను అడ్డం పెట్టుకుని మోసాలకు తెరలేపినట్టు ఈడీ గుర్తించింది. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్లు ప్రచారం చేసుకుంది. అధికారుల విచారణలో ఆమె ఎలాంటి ఉత్పత్తులు అమ్మలేదని తేలింది. యూజర్ రిజిస్ట్రేషన్ సౌకర్యంలేదు.
పేమెంట్ గేట్‌వేలు నిత్యం ఫెయిల్ కావడంతో వాట్సాప్ నెంబర్లు పని చేయకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కేవలం నిధుల మళ్లింపు కోసం ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసినట్టు తేల్చారు అధికారులు. ఇదే సమయంలో ఆమెకి సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ సేతురామన్‌తో సందీపాకు సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది.
తనకు-సందీపా విర్క్ మధ్య వచ్చిన ఆరోపణలను సేతురామన్ ఖండించారు. ఆమెతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట అరెస్టయిన సందీపా విర్క్‌ను అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. శుక్రవారం వరకు ఆమెకి ఈడీ కస్టడీ విధించింది. ఈ వ్యవహారంల మరికొందరి ప్రమేయంపై ఈడీ లోతుగా విచారణ చేపట్టింది.