Shilpa Shetty – Raj Kundra : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో పలు చిత్రాలు చేసి తెలుగు ఆడియన్స్ ని కూడా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే శిల్పా శెట్టి.. రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న తర్వాత అటు వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూ కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమె.. తన భర్తతో కలిసి భారీ మోసానికి పాల్పడుతోందనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. గతంలో ఒక కేసులో ఇరుక్కున్న వీరు ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం.
శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా దంపతులపై కేస్ ఫైల్..
అసలు విషయంలోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను ఈ దంపతులు మోసం చేశారనే అభియోగాలు మోపబడ్డాయి. పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి రూ.60 కోట్లు మోసం చేశారని, అటు శిల్పా శెట్టి రాజ్ కుంద్రా దంపతులపై దీపక్ కొఠారి అనే ఒక వ్యక్తి ఫిర్యాదు చేయగా.. ఆయన ఫిర్యాదు మేరకు జుహు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత దీనిని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయగా.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఏంటీ రూ.60 కోట్ల బిగ్ స్కామ్..
అసలు విషయంలోకి వెళ్తే 2015 -2023 వరకు ఒక వ్యాపార ఒప్పందం నిమిత్తం దాదాపు రూ.60.48 ఇచ్చానని.. అయితే ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకున్నారని దీపక్ ఆరోపించారు. షాపింగ్ ప్లాట్ఫారం బెస్ట్ డీల్ టీవీ కి వారు డైరెక్టర్లుగా ఉన్న సమయంలోనే వీరితో దీపక్ ఒప్పందం తీసుకున్నారట. అప్పటికే ఆ కంపెనీలో 87% కంటే ఎక్కువ వాటా కూడా కలిగి ఉన్నట్లు తెలిపారు.. ఇక 2016 ఏప్రిల్ లో తనకు శిల్పా శెట్టి వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని, ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని , ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా దాచి పెట్టిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఆ కంపెనీ ఆ తర్వాత కాలంలో దివాలా తీసింది అనే విషయం తెలిసిందని దీంతో తమకు భారీ నష్టం కలిగింది అని దీపక్ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం దీపక్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై శిల్పా శెట్టి దంపతులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
ALSO READ:Maheshbabu: మహేష్ బాబు మరదలు కారుకి ప్రమాదం.. కార్ వెనుక భాగం మొత్తం!