BigTV English

Coolie Collections : రజినీ ఖాతాలో హిట్.. డే 1 వసూళ్ల ప్రిడిక్షన్..కలెక్షన్ల సునామీనే..

Coolie Collections : రజినీ ఖాతాలో హిట్.. డే 1 వసూళ్ల ప్రిడిక్షన్..కలెక్షన్ల సునామీనే..

Coolie Collections : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున నెగెటీవ్ రోల్ చేసిన సినిమా కూలీ. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేసింది.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రజినీకాంత్ నుంచి వచ్చిన మరో యాక్షన్ ట్రీట్ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెగిటివ్ రోల్‌ చేసిన ఈసినిమాలో శృతి హాసన్, సత్య రాజ్, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ యాక్టర్ సౌబిన్ షాహిర్ వంటి భారీ కాస్ట్ ఉండటంతో, కూలీ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది.. ఇవాళ భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రీబుకింగ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..


‘కూలీ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. 

మొదటి నుంచి ఈ మూవీ పై ఇటు తెలుగులోనూ అటు కోలీవుడ్ లోనూ మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి.. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. అనుకున్న దానికన్నా ఈ సినిమాకు ఎక్కువగా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు వచ్చిన రివ్యూల ప్రకారం.. రజనీకాంత్ సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడని చెపుతూనే… సైమన్ పాత్రలో నాగార్జున విలన్‌గా గూస్ బంప్స్ తెప్పించాడు, గెస్ట్ రోల్ లో అమీర్ ఖాన్ అదరగొట్టాడు, యాక్షన్ సీన్లకు అనిరుధ్ బీజీఎం మామూలుగా లేదు.. అది నెక్ట్స్ లెవెల్. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ అయితే చెప్పడానికి రావడంలేదు. మొత్తానికి సినిమా మంచి టాక్ అయితే సొంతం చేస్తుంది. అటు కలెక్షన్స్ కూడా 1000 కోట్ల క్లబ్ లోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇవాళ 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. చూడాలి ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో..


Also Read : ఎన్టీఆర్ ‘వార్ 2’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్.. ఎన్ని కోట్లంటే..?

‘కూలీ ‘ పబ్లిక్ టాక్.. 

రజినీ కాంత్ నటించిన కూలీకి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. పలు చోట్ల ఫస్ట్ షోలు పడ్డాయి. ఈ చిత్రం చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విలన్ రోల్‌లో నాగార్జున అదరగొట్టాడని అంటున్నారు. అమిర్ ఖాన్ గెస్ట్ రోల్ బాగుందని చెబుతున్నారు. అనిరుద్ బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని అంటున్నారు. రజినీకాంత్ నటన అదిరిపోయిందని పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ఎంతగానో వెయిట్ చేశారు. అనిరుధ్ అదరిపోయే మ్యూజిక్ అందించగా.. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టింది కూలీ.. ఈ వీకెండు చాలా చోట్ల వర్షాల కారణంగా హాలిడేస్ ఉండడంతో ఈ సినిమాకి వెళ్లే అవకాశం కూడా ఉంది. సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు 1000 కోట్ల క్లబ్ లోకి కొన్ని రోజులను చేరుకునే అవకాశం ఉందని రజినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

Related News

Film Industry: ఇండస్ట్రీలో విషాదం…ఎన్టీఆర్ విలన్ భార్య కన్నుమూత!

The Raja saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, ఒక్క ట్వీట్ తో రచ్చ లేపిన మారుతి

Kantara Chapter1 pre release: ఎన్టీఆర్ నాకు హీరో కాదు… బ్రదర్ రిషబ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్!

OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్

Kantara Chapter 1 Pre release: నొప్పితో బాధపడుతున్న ఎన్టీఆర్.. ఎక్కువ మాట్లాడలేనంటూ!

Kantara Chapter 1 Event: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్, ఫ్యాన్స్ లో జోష్ నింపిన ప్రొడ్యూసర్

Kantara Chapter 1 Event : యాంకర్ సుమా పై మరోసారి సీరియస్ అయిపోయిన ఎన్టీఆర్

Niharika: కుటుంబానికి దూరంగా నిహారిక.. వాళ్ళే నా ప్రపంచం అంటూ!

Big Stories

×