Amitabh Bachchan.. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు అసలు హీరో ముఖమేనా అని ఎన్నో అవమానాలు,హేళనలు ఎదుర్కొన్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan).. అతి తక్కువ సమయంలోనే తన నటనను నిరూపించుకొని, స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఇక నేడు బాలీవుడ్ బిగ్ బీ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ కి గుర్తింపు తెచ్చిన వాటిల్లో బిగ్గెస్ట్ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్పతి (KBC)షో కూడా ఒకటి. ఇండియన్ మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈ రియాల్టీ షో ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాదు అటు బుల్లితెర ఆడియన్స్ కి కూడా మరింత దగ్గరయ్యారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న ఈయన సడన్గా ఈ కార్యక్రమం నుండి తప్పుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు కారణం ఏంటనే కోణంలో అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు.
KBC నుండి తప్పుకుంటున్న అమితాబ్ బచ్చన్..
అసలు విషయంలోకెళితే కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 2 2005 ఆగస్టు 5న స్టార్ ప్లస్ లో మొదలయ్యింది. అయితే ఈ కార్యక్రమానికి హోస్టుగా చేస్తున్నప్పుడు అమితాబ్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మధ్యలో వదిలేశారు. వాస్తవానికి మేకర్స్ కేబీసీ 2 కోసం 85 ఎపిసోడ్లు ప్లాన్ చేయగా.. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో 61 ఎపిసోడ్ లు మాత్రమే పూర్తి చేశారు. ఇందులో 61వ ఎపిసోడ్లో ప్రజెంట్ సర్కార్ చివరి కంటెస్టెంట్ గా నిలిచారు. ఇక ఆయన ఆటను కేబీసీ 3 లో పూర్తి చేయడం జరిగింది. ఇక కేబీసీ 3 ని షారుక్ ఖాన్ (Sharukh Khan) హోస్టుగా చేసినా ఫ్లాప్ అయింది. అందుకే అమితాబ్ బచ్చన్ ను మళ్లీ తీసుకొచ్చారు సోనీ ఛానల్ వారు. ఇక అలా అమితాబ్ బచ్చన్ మొదటి సీజన్ నుండి ఇప్పటివరకు దాదాపు 15 సీజన్లకు హోస్టుగా చేశారు. అయితే ఇలాంటి ఈయన తాజాగా షో నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యం సహకరించకపోవడంతోనే ఆయన ఈ షో నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన వస్తుందో లేదో చూడాలి. ఏది ఏమైనా కౌన్ బనేగా కరోడ్పతి షోను అత్యంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళుతున్న అమితాబ్ బచ్చన్ సడన్గా ఇప్పుడు ఈ షో నుండి తప్పుకోవడం పై అభిమానులు, నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది రూమర్ లేక నిజంగానే ఆయన ఈ షో నుండి తప్పుకోబోతున్నారా? అనే విషయం తెలియాలి అంటే, స్వయంగా అమితాబ్ బచ్చన్ ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది. మరి ఈ వార్త అమితాబ్ వరకు చేరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
అమితాబ్ బచ్చన్ కెరియర్..
అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే.. ఎనిమిది పదుల వయసు దాటినా సరే.. వరుసగా యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా ఇతర భాష చిత్రాలలో కూడా కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు అమితాబ్ బచ్చన్.