Jawa 42 Bike: ప్రస్తుతం దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో టూ వీలర్‌లకు ప్రత్యేక డిమాండ్ ఉంది. చాలా మంది వినియోగదారులు టూ వీలర్‌లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో బైక్‌లకు అధిక డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్లనే ప్రముఖ బైక్ తయారీ కంపెనీలు సైతం దేశీయ మార్కెట్‌లో కొత్త కొత్త బైక్‌లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. తాజాగా మరో బైక్ భారతదేశంలో లాంచ్ అయింది. ఇప్పటికి ఎన్నో బైక్‌లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకున్న ప్రముఖ సంస్థ జావా యెజ్డీ తాజాగా మరొక కొత్త మోడల్‌ను పరిచయం చేసింది.
జావా యెజ్డీ మోటార్ అప్డేటెడ్ అయిన ‘జావా 42’ బైక్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ దాదాపు రూ.1.73 లక్షల ధరతో రిలీజ్ అయింది. అయితే ఇందులో చాలా మెకానికల్ ఛేంజెస్ చేశారు. అంతేకాకుండా కాస్మెటిక్ ఛేంజెస్ కూడా జరిగాయి. ఇందులో 247.7 సిసి, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ బైక్ 27 బిహెచ్‌పీ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 26.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. అలాగే అసిస్ట్, స్లిప్ క్లచ్ వంటివి కూడా ఉన్నాయి.
Also Read: చీపెస్ట్ బైక్స్.. రూ. 70 వేలకే 70 కి.మీ మైలేజ్ ఇచ్చే అద్భుతమైన బైక్స్.. అధునాతన ఫీచర్లు కూడా!
లుక్ పరంగా ఈ కొత్త బైక్ పాత మోడల్ మాదిరి ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్ లైట్స్, కర్వ్డ్ రియర్ ఫెండర్, టియర్ డ్రాప్ షేప్‌లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ వంటివి ఉన్నాయి. అయితే ఇంతక ముందు కంటే ఇప్పుడు సీటుపై కూర్చోవడం కోసం మెరుగైన సర్దుబాటు చేశారు. అలాగే టెలిస్కోపిక్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్వర్లచే సస్పెండ్ చేయబడిన డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ వంటివి అందించారు. ఈ బైక్‌కి అల్లాయ్ వీల్స్ అందించారు. అంతేకాకుండా కంప్రెషన్, రీబౌండ్ డంపింగ్ ఛేంజ్ చేయబడింది.
ఇక బ్రేకింగ్ విషయానికొస్తే.. ఇందులో రెండు వైపులా డిస్క్ బ్రేకులు అందించబడ్డాయి. ఇందులో మొత్తం 14 కలర్స్ ఉంటాయి. వాటిలో మ్యాట్, గ్లాస్ వంటి వాటిని కొనుక్కోవచ్చు. అసలు సిసలైన పనితీరు కోసం ప్రస్తుత తరం రైడర్ల కోసం 2024 జావా 42 బైక్‌ను కంపెనీ రూపొందించింది. ఈ జావా యేజ్డి 42 బైక్ ఇంజిన్ అవుట్ గోయింగ్ బైక్ యూనిట్ కంటే మన్నికగా ఉంటుందని చెప్పబడింది. అందువల్ల మంచి రైడింగ్ పెర్ఫార్మెన్స్ అందించే బైక్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.