Jio Cashback Offer: ప్రైవేట్ టెలికాం దిగ్గజం జియో సెప్టెంబర్ నెల కోసం తన యూజర్లకు చక్కటి ఆఫర్ ను పరిచయం చేసింది. జియో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందే అవకాశాన్ని అందిస్తోంది. మొబైల్, ఫైబర్ రీఛార్జ్ లపై క్యాష్ బ్యాక్ అందించనునున్నట్లు ప్రకటించింది. CRED, Paytm లాంటి డిజిటల్ యాప్ లు, జియో అధికారిక వెబ్ సైట్ లో రీఛార్జ్ చేసుకునే వారికి కూడా ఈ ఆఫర్లు వర్తించనున్నట్లు ప్రకటించింది. నిర్దిష్ట ఆఫర్లలో UPI ఉపయోగించి చేసే కనీస రీఛార్జ్ లపై క్యాష్ బ్యాక్ ఉంటుంది. యాప్ ను బట్టి క్యాస్ బ్యాక్ ఆఫర్ మారుతుంది. ఉదాహరణకు UPI లావాదేవీలపై ఫ్లాట్ రూ. 30 క్యాష్ బ్యాక్ కోసం Paytmకు సంబంధించిన PTMJIO30 కోడ్ ను ఉపయోగించవచ్చు. అదే సమయంలో CRED లాంటి పార్ట్ నర్ పరిమిత కాల ఆఫర్లును పరిశీలించవచ్చు.
ఈ ఆఫర్లను ఎలా గుర్తించాలి?
⦿ పేటీఎంలో చెక్ చేయండి: మీరు జియో మొబైల్ రీఛార్జ్ చేయడానికి ముందు, Paytm వెబ్ సైట్. యాప్ ను చూడాలి. రీఛార్జ్ విభాగానికి వెళ్లి, PTMJIO30 వంటి అందుబాటులో ఉన్న ప్రోమో కోడ్ లను అప్లై చేయాలి.
⦿ CREDని ఉపయోగించండి: CRED యాప్ లో రీఛార్జ్, బిల్ చెల్లింపు విభాగంలో ఆఫర్ కోసం చూడండి. క్యాష్ బ్యాక్ పొందడానికి మీ Jio రీఛార్జ్ కోసం CRED పే, CRED UPIని ఉపయోగించండి. CRED Pay/UPI ద్వారా చేసిన రీఛార్జ్ లకు నిర్దిష్ట క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.
⦿ MyJio పోర్టల్ ని సందర్శించండి: Paytm UPI వంటి నిర్దిష్ట చెల్లింపు పద్ధతులకు సంబంధించిన ఏవైనా పరిమిత-కాల క్యాష్ బ్యాక్ ఆఫర్ల కోసం అధికారిక Jio వెబ్ సైట్ jio.com, MyJio యాప్ ను కూడా తనిఖీ చేయవచ్చు. ఇందులో ఏ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే, ఎంత క్యాష్ బ్యాక్ లభిస్తుందో క్లియర్ గా రాసి ఉంటుంది.
⦿ ఇతర అగ్రిగేటర్ సైట్లను తనిఖీ చేయండి: Desidime, CouponDunia లాంటి వెబ్ సైట్లు Jio రీఛార్జ్ ల కోసం కూపన్, క్యాష్ బ్యాక్ డీల్స్ జాబితాను చెక్ చేసుకోవచ్చు.
⦿ ఆఫర్ చెల్లుబాటును చెక్ చేయండి: మీకు ఆసక్తి ఉన్న ఆఫర్ సెప్టెంబర్ 2025 నెల వరకు చెల్లుబాటు అయ్యేలా ఉందో? లేదో? చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రమోషన్లకు నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది.
Read Also: BSNL డబుల్ ధమాకా.. పాత ధరకే సూపర్ బెనిఫిట్స్!
⦿ నిబంధనలు, షరతులను పరిశీలించండి: కనీస రీఛార్జ్ మొత్తాలు, వినియోగదారు పరిమితులు, క్యాష్ బ్యాక్ అందుకోవడానికి ఇతర ప్రమాణాలను వివరించే నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవాలి. కండీషన్స్ తెలుసుకోకుండా రీఛార్జ్ చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
Read Also: 2 జీబీ డేటా.. 28 రోజుల వ్యాలిడిటీ.. మరీ ఇంత తక్కువ ధరకా?