BigTV English

OTT Movie : డేటింగ్ యాప్‌లో ఆటలు… తెల్లార్లూ అదే పని… పార్ట్నర్‌గా ఉండగానే మరొకరితో…

OTT Movie : డేటింగ్ యాప్‌లో ఆటలు… తెల్లార్లూ అదే పని… పార్ట్నర్‌గా ఉండగానే మరొకరితో…

OTT Movie : మనిషి రిలేషన్స్ ఎమోషన్స్ తో ముడిపడి ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా బంధాలు దెబ్బతింటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక డేటింగ్ యాప్ లో పరిచయమైన ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఈ పరిచయాలలో ఎమోషన్స్ ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించారు. అయితే ఒక్కోసారి ఇది హద్దులు దాటిపోయి మతి పోగొడతాయి. రొమాంటిక్ సినిమాలను ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా హాట్ సీన్స్ తో కనువిందు చేస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

లాస్ ఏంజిల్స్‌లో మార్టిన్ ఒక విడాకులు తీసుకున్న ఫార్మసిస్ట్. గాబీ స్పెయిన్ నుండి వచ్చిన ఫిజికల్ థెరపీ అసిస్టెంట్. సోషల్ మీడియా డేటింగ్ యాప్ విన్క్స్ ద్వారా వీళ్ళు కలుస్తారు. ఇద్దరూ మొదట్లో ఈ యాప్‌ను సరదాగా ఉపయోగిస్తారు. వీళ్ళ మొదటి డేట్ రాత్రంతా మాటలతోనే కొనసాగుతుంది. ఆ తరువాత వీళ్ళు త్వరగా ప్రేమలో పడి, ఒకరితో ఒకరు కలిసి జీవించడం ప్రారంభిస్తారు. యాప్‌ను తొలగించి, సంబంధాన్ని సీరియస్‌గా మార్చుకుంటారు. కానీ కొన్ని నెలల్లోనే ఈ సంబంధం నీరసంగా అనిపిస్తుంది. మార్టిన్ తన మాజీ భార్యతో మెస్సేజ్ లు పంచుకోవడం, గాబీ కూడా ఏవో రహస్యాలు దాస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక రాత్రి ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకుంటారు. కానీ తమ ప్రేమను కాపాడుకోవడానికి ఓపెన్ రిలేషన్‌షిప్‌ను ట్రై చేస్తారు. వీళ్ళు ఇతరులతో ఫ్లర్ట్ చేయడం, డేటింగ్ చేయడం, థ్రీసమ్‌లలో పాల్గొనడం ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రయోగం వీళ్ళ మధ్య ఈర్ష్య పెంచుతుంది.


ఓపెన్ రిలేషన్‌షిప్ బెడిసికొడుతుంది. గాబీ ఒక సంపన్న వ్యాపారవేత్త లారీతో సంబంధం పెట్టుకుంటుంది. అతను ఆమెను రాయల్టీలా చూసుకుంటాడు, కానీ తర్వాత అవమానిస్తాడు. మార్టిన్ తన మాజీ స్నేహితురాలు బెథనీతో కలుస్తాడు. కానీ ఆ తరువాత స్నేహపూర్వకంగా విడిపోతారు. ఇక గాబీ ఒక క్లబ్‌లో లారీతో గొడవపడి ఇద్దరు పురుషులను రెచ్చగొడుతుంది. కానీ ఎమోషనల్ గా కుప్పకూలి, మార్టిన్‌కు టెక్స్ట్ చేస్తుంది. వీళ్ళు మళ్ళీ తిరిగి కలుస్తారు. మార్టిన్ ఓపెన్ రిలేషన్‌షిప్‌తో సౌకర్యంగా లేనట్లు ఒప్పుకుంటాడు. గాబీ, మార్టిన్ తమ తప్పులను ఒప్పుకుని, “ప్రేమ అంటే ఒకరినొకరు వదులుకోకపోవడం” అని నమ్ముతూ, తమ సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటారు. ఇలా ఈ కథకి శుభం కార్డ్ పడుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో

‘న్యూనెస్’ (Newness) 2017లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ చిత్రం. డ్రేక్ డోరెమస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నికోలస్ హౌల్ట్ (మార్టిన్ హాలాక్), లైయా కోస్టా (గాబీ సిల్వా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2017 జనవరి 25న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి, 2017నవంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో కూడా అందుబాటులో ఉంది.

Read Also : భార్యకు తెలియకుండా మరో అమ్మాయితో… కూతురు కూడా తండ్రితో చేతులు కలిపి ఇదేం దిక్కుమాలిన పనిరా అయ్యా ?

Related News

Kannappa Movie OTT : ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైన కన్నప్ప… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Param Sundari : బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న జాన్వీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movie : మత ప్రచారానికి వెళ్లి మట్టిలోకి… అంతుచిక్కని మిస్టరీలు ఉన్న నరకం ఆ ఊరు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : ఈమె అమ్మాయా ఆడ పిశాచా? ఇంత కరువులో ఉందేంటి భయ్యా… సింగిల్స్ కు ఎంజాయ్ పండగో

Big Stories

×