BigTV English

Kishkindapuri – Mirai: వెనక్కు తగ్గిన బెల్లంకొండ, కంటెంట్ చూసి భయమా? సినిమా మీద గౌరవమా?

Kishkindapuri – Mirai: వెనక్కు తగ్గిన బెల్లంకొండ, కంటెంట్ చూసి భయమా? సినిమా మీద గౌరవమా?

Kishkindapuri – Mirai: రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమాకు సంబంధించి టీజర్ కానీ ట్రైలర్ గానీ ఆకట్టుకునే విధంగా ఉంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అయితే తేజ సజ్జ నటించిన మిరాయ్ టీజర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతకుముందు ఆ సినిమా మీద అంచనాలు అంతంత మాత్రమే ఉండేవి. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.


దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ బట్టి పార్ట్ 2 తీస్తారేమో అనిపిస్తుంది. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ మాత్రం హై లెవెల్ లో ఉన్నాయి.

వెనక్కు తగ్గిన బెల్లంకొండ


అల్లుడు శీను (Alludu Sreenu) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకు వెళ్లాడు. ఇక ప్రస్తుతం కౌశిక్ దర్శకత్వంలో కిష్కింధపురి అనే సినిమాను చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాను మొదటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి సెప్టెంబర్ 12న మిరాయ్ సినిమా ఉంది కాబట్టి, ఈ సినిమాను వెనక్కి తగ్గుతుంది అనుకోవచ్చు.

భయమా? గౌరవమా? 

వాస్తవానికి మిరాయ్ సినిమాకు సంబంధించిన కంటెంట్ అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా సక్సెస్ కొడతాడు అని చాలామంది అంచనా వేస్తున్నారు. మరోవైపు కిష్కింధపురి వీడియో కంటెంట్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే మిరాయి సినిమాతో పోటీకి వస్తే ఈ సినిమాకి నష్టం జరుగుతుందని భయపడుతున్నారా? లేకపోతే అన్ని సినిమాలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాను వాయిదా వేశారా? అని సోషల్ మీడియా వేదికగా కొంతమంది చర్చిస్తున్నారు. ఖచ్చితంగా రెండు సినిమాలు ఒకే రోజు కాకుండా, ఒకరోజు గ్యాప్ లో వేస్తే రెండిటినీ ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. అంతేకాకుండా తేజ సజ్జ తో బెల్లంకొండకు మంచి బాండింగ్ కూడా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (bellamkonda Sai Srinivas) భైరవం (Bhairavam) తర్వాత చేస్తున్న సినిమా ఇది. భైరవం సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడు వేచి చూడాలి.

Also Read : Venkatesh: వెంకటేష్ ఇంట్లో విషాదం… 12 సంవత్సరాలుగా కలిసి ఉన్న స్నేహితుడు దూరం

Related News

Usthad Bhagath Singh : బద్రి వైబ్… పవర్ స్టార్ ను ఎలా చూపించాలో హరీష్ కు తెలుసు

Upcoming Movies in Theater : సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..

Vijay- Rashmika : విజయ్, రష్మిక హ్యాట్రిక్ మూవీ షూటింగ్ నేటి నుంచే స్టార్ట్… మొత్తం స్టోరీ ఇదే

Teja Sajja: కల్కి 2 లో ఆ పాత్రలో చాన్స్ కొట్టేసిన తేజ సజ్జ… ఇక తిరుగుండదుగా?

Anushka Shetty: రానాతో అనుష్క ఫోన్ కాల్, పెళ్లి గురించి కూడా క్లారిటీ

Big Stories

×