RBI WhatsApp Channel: ఆర్థిక సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా తన అధికారిక WhatsApp ఛానెల్‌ను ప్రారంభించింది. ఈ చానెల్ ద్వారా, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో లేదా తక్కువ ఇంటర్ నెట్ ఉన్న ప్రాంతాలలో వినియోగదారులు కూడా సులభంగా బ్యాంకింగ్, ఆర్థిక సంబంధిత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారాన్ని
ఈ కొత్త ఛానెల్ కు “RBI Kehte Hain” (RBI) అని పేరు పెట్టారు. ఇది RBI ప్రజా అవగాహన కార్యక్రమంలో భాగంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే SMS, టెలివిజన్ ప్రకటనలు, వార్తాపత్రికలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తోంది. WhatsApp వంటి ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వినియోగం ద్వారా, RBI దేశంలోని మరింత మందిని చేరుకునే అవకాశం కల్పిస్తోంది.
RBI WhatsApp ఛానెల్ ప్రారంభం ఎందుకు?
ఆర్బీఐ వాట్సాప్ ఛానెల్ ప్రారంభించాలనే ప్రాథమిక ఉద్దేశ్యం, వినియోగదారులకు ధృవీకరించబడిన, సకాలిక ఆర్థిక సమాచారాన్ని నేరుగా అందించడం. ప్రస్తుతం, సోషల్ మీడియా వేదికలు ఎక్కువగా నకిలీ వార్తలు, మోసాల విషయాలను వ్యాపింపజేస్తున్న సందర్భంలో, ఈ ఛానెల్ ఒక విప్లవాత్మక పరిష్కారం అని RBI భావిస్తుంది. RBI ఏప్రిల్ 4, 2025 నాటి తన ప్రకటనలో ఇలా పేర్కొంది “WhatsAppలో ధృవీకరించబడిన ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్’ ఖాతా ద్వారా, భౌగోళిక స్థానంతో సంబంధం లేకుండా, ముఖ్యమైన ఆర్థిక సమాచారాన్ని అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యమని తెలిపింది. ఈ WhatsApp ఛానెల్ ద్వారా, RBI ప్రజలకు ఆర్థిక వ్యవస్థపై అవగాహన పెంచడం, మోసాలను నివారించడం, బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితంగా చేసేందుకు సపోర్ట్ చేస్తుంది.
RBI WhatsApp ఛానెల్ ద్వారా ఎలాంటి సమాచారం అందించబడుతుంది?
-ఈ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసిన తరువాత, వినియోగదారులు క్రింద తెలిపిన విషయాలపై మెసేజులను అందుకోవడం ప్రారంభిస్తారు
-వినియోగదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిషింగ్ హక్కులను గుర్తించడం ద్వారా వారి ఖాతాలను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవచ్చు.
-ఫైనాన్షియల్ స్కామ్స్, ఫేక్ ఆఫర్లు, మోసపూరిత కాల్స్ గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు RBI సహాయం చేస్తుంది.
-వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవడం, బ్యాంకులతో సంబంధం పెట్టుకునే విధానాలను అవగాహన చేసుకోవచ్చు
-RBI ద్వారా ఎటువంటి మార్పులు వచ్చినా, వాటి గురించి వినియోగదారులు అర్థం చేసుకోగలుగుతారు.
-బ్యాంకింగ్, ఆర్థిక విధానాలపై వచ్చిన తప్పుడు సమాచారాన్ని తిరస్కరించడం, ఫేక్ న్యూస్‌ను నివారించుకోవచ్చు
RBI WhatsApp ఛానెల్‌లో చేరడం చాలా సులభం. ఈ క్రింది దశలను అనుసరించండి:
-RBI తన అధికారిక వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా పేజీలలో షేర్ చేసిన QR కోడ్‌ను స్కాన్ చేయండి.
-Whatsappలో RBI: QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత, మీరు నేరుగా RBI WhatsApp ఖాతాకు మారిపోతారు.
-‘Join’ క్లిక్ చేయండి: అప్పుడు “Join” అనే బటన్‌ను క్లిక్ చేయండి.
-మీరు “Join” క్లిక్ చేసిన తరువాత, RBI నుంచి మీరు ఆర్థిక సమాచారం అందుకోవడం ప్రారంభిస్తారు.
-RBI WhatsApp ఖాతా 9999 041 935 నంబర్ ద్వారా ఇది నిర్వహించబడుతుంది.