BigTV English
Advertisement

Savings Interest Rate: సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు పెట్టడం ఇక వేస్ట్.. తగ్గిన వడ్డీ రేట్లతో సంపద సృష్టి కష్టమే

Savings Interest Rate: సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు పెట్టడం ఇక వేస్ట్.. తగ్గిన వడ్డీ రేట్లతో సంపద సృష్టి కష్టమే

Savings Interest Rate| సామాన్యులకు సేవింగ్స్ ఖాతాలు ఎప్పుడూ ఒక సురక్షితమైన, సౌకర్యవంతమైన డబ్బు నిల్వ చేసే ఆప్షన్. కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025లో కీలక వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో.. సేవింగ్స్ ఖాతాలలో ఎక్కువ డబ్బు ఉంచడం మంచి నిర్ణయం కాకపోవచ్చు.


దేశంలోని పెద్ద బ్యాంకులు ఈ రేటు తగ్గింపు పట్ల వేగంగా స్పందించాయి. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇప్పుడు సేవింగ్స్ ఖాతాలపై సంవత్సరానికి కేవలం 2.5 శాతం వడ్డీని అందిస్తోంది ఇటీవలి సంవత్సరాలలో అత్యంత తక్కువ వడ్డీ రేటు ఇదే. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డ్యుయెచ్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు 2.75 శాతం వడ్డీని అందిస్తున్నాయి. IDFC ఫస్ట్ బ్యాంక్ వంటి చిన్న బ్యాంకులు 5 లక్షల నుండి 10 కోట్ల రూపాయల బ్యాలెన్స్‌లపై 3 శాతం నుండి 7 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. అయితే, చాలా మందికి సేవింగ్స్ ఖాతాల నుండి 3 శాతం కంటే తక్కువ వడ్డీ వస్తోంది.

తక్కువ వడ్డీ రేట్లతో ఏంటి సమస్య?
అసలు సమస్య ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్). ఒకవేళ ద్రవ్యోల్బణం 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. మీ సేవింగ్స్ ఖాతా నుండి 2.5 శాతం –3 శాతం వడ్డీ వస్తే, మీ డబ్బు విలువ తగ్గుతుంది. సరళంగా చెప్పాలంటే, ఈ రోజు మీ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బుతో.. వచ్చే సంవత్సరం అదే వస్తువులను కొనలేరు.


సేవింగ్స్ వడ్డీ రేట్లపై..సెబీ (SEBI)-రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ సలహాదారు.. సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ ఇలా వివరించారు. “సేవింగ్స్ ఖాతాలు రోజువారీ ఖర్చులు, బిల్లుల చెల్లింపులకు ఉపయోగపడతాయి. కానీ సంపద సృష్టికి కాదు.” ఒకటి లేదా రెండు నెలల ఖర్చుల కోసం మాత్రమే సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉంచమని, మిగిలిన డబ్బును రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా ఇతర చోట్ల పెట్టుబడి పెట్టమని ఆయన సలహా ఇస్తున్నారు.

మీ డబ్బును ఎక్కడ పెట్టాలి?
తక్కువ వడ్డీ ఇచ్చే సేవింగ్స్ ఖాతాలలో ఎక్కువ డబ్బు ఉంచడం కంటే.. మంచి రాబడి ఇచ్చే ఇతర డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs), డెట్ మ్యూచువల్ ఫండ్స్ రెండూ మంచి ఎంపికలు. ఈ రెండింటిపై ఒకే విధనమైన పన్ను విధించబడతాయి, కానీ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రీడెంప్షన్ సమయంలో మాత్రమే పన్ను చెల్లించాలి, ఇది ఒక ప్రయోజనం.

సపియెంట్ (sapient) ఫిన్‌సర్వ్ డైరెక్టర్ పల్లవ్ బగరియా మాట్లాడుతూ.. “సేవింగ్స్ ఖాతాలు రోజువారీ అవసరాలైన జీతం క్రెడిట్, UPI లావాదేవీలు, బిల్లు చెల్లింపులు, EMIలు, ఆటో-డెబిట్‌లకు అవసరం. కానీ, దీర్ఘకాలిక సంపద నిల్వకు ఇవి సరైనవి కావు,” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలపరిమితి ఆధారంగా బగరియా ఈ సలహాలు ఇస్తున్నారు:

ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం: లిక్విడ్ ప్లస్ లేదా ఆర్బిట్రేజ్ ఫండ్స్. ఇవి తక్కువ రిస్క్‌తో మంచి రాబడి, లిక్విడిటీని అందిస్తాయి.
1–3 సంవత్సరాలు: కార్పొరేట్ FDs, షార్ట్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. ఇవి రాబడి, భద్రతను సమతుల్యం చేస్తాయి.
3 సంవత్సరాలకు పైగా: ఈక్విటీ లేదా ఈక్విటీ-ఓరియెంటెడ్ ఫండ్స్. ఇవి ఎక్కువ రిస్క్‌తో సంపద సృష్టికి అవకాశం ఇస్తాయి.

Also Read: ఈ యాప్‌లను వెంటనే ఫోన్ నుంచి తొలగించండి.. గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరిక

చివరగా చెప్పాలంటే.. సేవింగ్స్ ఖాతాలు రోజువారీ ఆర్థిక లావాదేవీలు, అత్యవసర నిధులకు అవసరం. కానీ, దీర్ఘకాలిక సంపద పెంపు కోసం ఇవి సరిపోవు. వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉండటంతో, మీ డబ్బు.. కాలంతో పాటు విలువ కోల్పోతుంది. రెండు నెలల ఖర్చుల కోసం సేవింగ్స్ ఖాతాలో ఉంచి, మిగిలిన డబ్బును మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా మంచి ఎంపికలలో పెట్టుబడి పెట్టండి. మీ డబ్బు భవిష్యత్తు అవసరాల కోసం కాలంతోపాటు పెరగాలనే లక్ష్యంగానే ఖర్చు లేదా పెట్టుబడి చేయడం చాలా అవసరం.

Related News

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Big Stories

×