BigTV English

Samantha: 40కి చేరువలో కూడా.. ఇంత యవ్వనానికి కారణం అదే అంటున్న సమంత!

Samantha: 40కి చేరువలో కూడా.. ఇంత యవ్వనానికి కారణం అదే అంటున్న సమంత!

Samantha:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలకి ఉన్నంత లైఫ్ టైమ్ హీరోయిన్లకు ఉండదు అని చెబుతారు. కానీ కొంతమంది హీరోయిన్లు 4 పదుల వయసు కాదు కదా 6 పదుల వయసుకు వచ్చినా సరే నిత్య యవ్వనంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఉదాహరణకు టబు (Tabu), శ్రియా శరన్(Shriya Saran), స్నేహ(Saran), జెనీలియా (Genelia), సమంత (Samantha) ఇలాంటి హీరోయిన్లను చూస్తే మాత్రం ఇంకా యవ్వనంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే ఈ వయసులో కూడా వీరు ఇంత యవ్వనంగా ఉండడానికి కారణం ఏంటి? వారు తీసుకునే ఆహారం ఎటువంటిది? వారి డైలీ దినచర్య ఎలాంటిది? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సమంత ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


40కి చేరువలో కూడా నిత్య యవ్వనం..

40కి చేరువలో ఉన్నా కూడా నిత్య యవ్వనంగా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఒకవైపు నిర్మాతగా, మరొకవైపు హీరోయిన్ గా ఇంకొక వైపు పలు యాడ్స్ లో చేస్తూ అత్యంత బిజీగా మారిపోయింది. అయినప్పటికీ తన దైనందిక జీవితంలో సరైన నియమాలను పాటిస్తూ..తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటోంది. మరి సమంత ఇంత ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.


సమంత ఫిట్నెస్ సీక్రెట్..

సమంత ఫిట్నెస్ ప్రియురాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. తన శరీరాన్ని టోన్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కార్డియో వ్యాయామాలతో పాటు శరీరాన్ని బలంగా ఉంచుకునేలా వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటుంది. ఇక దినచర్యలో భాగంగా సైక్లింగ్, పరుగు, వెయిట్ లిఫ్టింగ్, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగ, పైలెట్స్ వంటివి కూడా చేస్తూ ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్ విషయానికి వస్తే..

బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటుంది. మాంసాహారం, పాల ఉత్పత్తులు, టన్నుల కొద్ది కూరగాయలు వంటి వాటికి దూరంగా ఉంటుంది. ఆమె తీసుకునే ఆహారం ఏదైనా సరే మితంగానే ఉంటుంది. పైగా తన రోజును ఒక గిన్నె పండ్లు, అందులోనే గింజలు, ఓట్స్, డ్రైఫ్రూట్స్ తోనే ప్రారంభిస్తుంది.

సమంత తీసుకునే భోజనంలో ఇవి తప్పనిసరి..

ఇక మధ్యాహ్నం భోజనంలో బ్రౌన్ రైస్, వెజిటబుల్ కర్రీ, తక్కువ నూనె కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుంది. వీటితోపాటు రసం, సాంబార్, పప్పు వంటివి కూడా తింటుంది. కానీ తినే మొత్తంలో చాలా తక్కువ మోతాదులోనే తీసుకుంటుందని సమాచారం.

సాయంత్రం స్నాక్స్ విషయానికి వస్తే..

ఎక్కువగా స్నాక్స్ తినడానికి సమంత ఇష్టపడుతుందట. అందులో గ్రీన్ టీ, పండ్లు, స్మూతీలను తీసుకుంటుంది. ఇక రోజుకు మూడుసార్లు గ్రీన్ టీ, చక్కర లేని స్మూతీతో కూడిన పండ్లను తింటుంది సమంత.

తేలికపాటి విందు..

కూరగాయలకు పెద్ద అభిమాని అయిన ఈమె.. ఉడికించిన కూరగాయల సూపు, అలాగే ఒక గిన్నె క్వినోవాతో కలిపి తీసుకుంటుంది. ఇక ప్రతిరోజు రాత్రి 8 గంటల లోపే తన విందును పూర్తి చేస్తుంది సమంత.

80/20 నియమం తప్పనిసరి..

అంతేకాదు సమంత ఎప్పుడు 80/20 నియమాన్ని పాటిస్తుంది. అంటే 80% ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడానికి సమయం కేటాయిస్తే.. అందులో 20% బిర్యానీ , డెసర్ట్లతో తనకు ఇష్టమైన ఆహారాలను ఆస్వాదిస్తుంది.

ALSO READ:Bigg Boss 9: సల్మాన్ బాటలో నాగ్ మావ.. ఆశ పడితే ఇబ్బంది పడతావేమో గురూ!

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×