Big Stories

IPL 2024 LSG vs KKR Match Preview: మరికాసేపట్లో లక్నోతో కోల్‌కతా ఢీ.. టాస్ కీలకం కానుందా..?

LSG vs KKR Match Preview: ఐపీఎల్ సీజన్ 2024లో మొదటి నుంచి స్థిరంగా ఆడుతున్న జట్లలో కోల్ కతా నైట్ రైడర్స్ ఒకటి. ఇంతకు ముందు ఎవరూ ఈ జట్టు, ఈ రేంజ్ లో ఆడుతుందని ఊహించలేదు. ప్రస్తుతం దాని హవా అలా సాగుతోంది. అయితే నేడు ఐపీఎల్ లో కోల్ కతా వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఏక్ నా స్టేడియం, లక్నోలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

ప్రస్తుతం కోల్ కతాని చూస్తే అన్నిరంగాల్లో బలంగా కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో టాప్ 2 లో ఉంది. 10 మ్యాచ్ లు ఆడింది. 7 గెలిచి 14 పాయింట్లతో పటిష్టంగా ఉంది. ఇక లక్నో విషయానికి వస్తే…తను కూడా గట్టిగానే ఉంది. 10 మ్యాచ్ లు ఆడి 6 విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.

- Advertisement -

ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచ్ లు జరిగాయి. లక్నో 3 గెలిస్తే, కోల్ కతా ఒకటి గెలిచింది.

కోల్ కతా విషయానికి వస్తే ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్ క్రిష్ రఘువంశీ, కెప్టెన్ శ్రేయాస్, వెంకటేష్ అయ్యర్ వీరందరూ నిలబెడుతున్నారు. అయితే రింకూ సింగ్ ఇంకా ఫుల్ టచ్ లోకి రాలేదు. బౌలింగులో వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, అండ్రీ రసెల్ మ్యాచ్ ల్లో కీలకంగా మారి విజయాలను అందిస్తున్నారు.

లక్నో విషయానికి వస్తే కెప్టెన్ కేఎల్ రాహుల్ కాసేపు ఆడుతున్నాడు. మిగిలిన వాళ్లు ఏదోరకంగా ముందుకు నడుపుతున్నారు. అయితే అద్భుతాలేవీ జరగడం లేదు. కూల్ గా వెళుతున్నారు. అంతకన్నా కూల్ గా విజయాలు సాధిస్తున్నారు. అర్షిణ్ కులకర్ణి, దీపక్ హుడా, నికోలస్ పూరన్ వీరందరూ అవసరానికి తగినట్టుగా ఆడుతున్నారు.

Also Read: పంజాబ్ కింగ్స్ ఈసారి ఏం చేస్తుంది? నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ

బౌలింగు కూడా బలంగా ఉంది. మార్కస్ స్టోనిస్, మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, దీపక్ హుడా అందరూ పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నారు. మరి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎలా సాగుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News