Post Office Savings scheme: నేటి సమాజంలో పొదుపు అనే మంత్రం పాటించకుంటే తిప్పలు తప్పవు. ఔను నిజమే కదా మరి.. ప్రస్తుత అవసరాలు అటువంటివి. సంపాదించే డబ్బులో పొదుపు పాటించారో.. మీ అత్యవసరాలకు మీ వద్ద డబ్బు ఉన్నట్లే. ఏ అవసరం వచ్చినా, డబ్బు పొదుపు చేశామన్న ధీమా మనలో ఉంటుంది. అందుకే ఏ కుటుంబం డబ్బు ఆదా, పొదుపు పాటిస్తుందో ఆ కుటుంబ సభ్యులు అప్పుకు బహుదూరమని చెప్పవచ్చు.
డబ్బు పొదుపు చేయాలని భావించిన వారికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా పొదుపు పాటించే వారి కోసమే పోస్టల్ శాఖ ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టింది. సామాన్య కుటుంబాలు సైతం ఈ స్కీమ్స్ లో భాగస్వామ్యులు కావచ్చు. ఊహించని రీతిలో తక్కువ కాలవ్యవధిలో లక్షలు పొదుపు చేసుకొనే అవకాశం పోస్టల్ డిపార్ట్మెంట్ కల్పిస్తోంది. మరి మీరు కూడా లక్షలు కళ్లారా చూడాలా.. అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే.
ప్రధానంగా మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని, పోస్టాఫీసులో ఓ పథకం అమలవుతోంది. ఈ పథకం ద్వారా మీ డబ్బు సేఫ్.. అలాగే అధిక వడ్డీని కూడా మీరు పొందగలుగుతారు. ఇందుకు మీరు చేయవలసిందల్లా.. మీ దగ్గరలోని పోస్టాఫీస్ ను సంప్రదించాలి. మీకు అక్కడ ఖాతా లేకుంటే కేవలం రూ. 100 లతో మీ ఖాతాను రెడీ చేస్తారు పోస్టాఫీస్ సిబ్బంది. అలాగే మీరు నెలవారీ పొదుపు కోసం పోస్టల్ ఆర్డీని స్కీమ్ ను ఎంచుకోవాలి. కేవలం ప్రతినెల రూ. 4 వేలు చెల్లిస్తే చాలు.. 5 సంవత్సరాలకు ఏకంగా రూ. 2.85 లక్షలు పొందవచ్చు. ఇందులో మీరు చెల్లించే డబ్బు రూ. 240000 కాగా, 6.7 శాతం వడ్డీ రూ. 45459 లుగా నిర్ధారించి ఐదేళ్లకు మొత్తం లక్షల్లో మీకు అందిస్తారు.
Also Read: Kakinada PDS rice smuggling: కాకినాడ కింగ్ పిన్ ఎవరు? ముసుగు తొలగేనా? గుట్టురట్టయ్యేనా?
పోస్టల్ స్కీమ్స్ ను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. అందుకే మీ డబ్బు ఇక్కడ సేఫ్ అంటున్నారు పోస్టల్ శాఖ అధికారులు. అంతేకాదు మధ్యతరగతి కుటుంబాల వారి కోసం మరెన్నో స్కీమ్స్ ను పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. ఓసారి మీ దగ్గరలోని పోస్టాఫీసు కార్యాలయాన్ని సంప్రదించండి.. మీ డబ్బు పొదుపు చేయండి.. మీరు లక్షాధికారి కండి. చివరగా డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు సుమా.. మరచిపోవద్దు పొదుపు మంత్రం పాటించండి.