BigTV English

Priyanka Jain: తిరుమల వివాదంపై ప్రియాంక, శివ్ స్పందన.. తప్పు తెలుసుకొని సారీ చెప్పేశారు

Priyanka Jain: తిరుమల వివాదంపై ప్రియాంక, శివ్ స్పందన.. తప్పు తెలుసుకొని సారీ చెప్పేశారు

Priyanka Jain: చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. తర్వాత వచ్చే పరిణామాలను గ్రహించకుండా ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు, వ్లాగ్స్ చేస్తూ.. వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. దానివల్ల ఎంతోమంది ఎన్నో సమస్యలు ఎదురైనా కూడా వాళ్లు ఆలోచించకుండా చేసే వీడియోల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాగే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ (Priyanka Jain), తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌ (Shiv)తో కలిసి తిరుమలలో చేసిన ఒక వీడియో.. తాజాగా భక్తులను హర్ట్ చేసింది. దానివల్ల వారిద్దరూ చట్టపరమైన చర్యలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ విషయంపై క్షమాపణలు చెప్పడానికి ప్రియాంక, శివ్ ముందుకొచ్చారు.


ఉద్దేశ్యం అది కాదు

‘‘మార్చిలో తిరుపతిలో మేము చేసిన ఒక వ్లాగ్.. ఇంతమంది శ్రీవారి భక్తులను హర్ట్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఎంటర్‌టైన్మెంట్ చేసిన ఏ వీడియో కూడా ఇలా మారిపోతుందని అనుకోలేదు. ఇంతమంది హర్ట్ అవుతారని తెలిస్తే ఇలాంటి వీడియో చేసేవాళ్లమే కాదు. మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చాలని మేము అస్సలు అనుకోలేదు. అలా అని కలలో కూడా అనుకోలేం. భక్తుల్లో భయం కలగాలని ఈ వీడియో అస్సలు చేయలేదు. మేమిద్దరం వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తులం. అది మీ అందరికీ కూడా తెలుసు. శ్రీవారి భక్తులను కించపరిచేలా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు, టీటీడీ పవిత్రతను దెబ్బతీసే లక్ష్యంతో ఈ వీడియో అస్సలు చేయలేదు’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంక, శివ్.


Also Read: ధనుష్ వర్సెస్ నయనతార కాంట్రవర్సీ.. విఘ్నేష్ శివన్‌పై ఎఫెక్ట్

తప్పకుండా క్షమించండి

వారు విడుదల చేసిన వీడియో చివర్లో తెలియకుండా చేసిన తప్పును తప్పకుండా క్షమిస్తారని కోరుకుంటున్నామంటూ అందరికీ సారీ చెప్పారు ప్రియాంక, శివ్. ఈ ఇద్దరూ కలిసి చాలాకాలం క్రితమే ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. అందులో ఎక్కువగా ఒకరిపై ఒకరు ప్రాంక్స్ వీడియోలు చేస్తుంటారు. అలాగే వారు తిరుమలలో చేసిన ఒక ప్రాంక్ వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఆ వీడియో విడుదలయ్యి చాలాకాలమే అయినా అది ఇప్పుడు వైరల్ అవ్వడంతో వారిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ అనుకుంటోంది. దీంతో వారు క్షమాపణలు చెప్పక తప్పలేదు. అందుకే వీడియో విడుదల చేయడంతో పాటు అందరికీ క్షమాపణ చెప్తూ ఒక నోట్ కూడా అటాచ్ చేశారు.

తెలియకుండా జరిగిపోయింది

‘జీవితంలో జరిగే ప్రతీదానికి ఏదో ఒక కారణం ఉంటుందని అంటుంటారు. కాలమే అన్నీ అందరికీ నేర్పిస్తుందని మేము బలంగా నమ్ముతాం. మనం దాని నుండి నేర్చుకున్నామా లేదా అన్నదే ముఖ్యం. తెలియకుండా తప్పులు చేసినప్పుడు దానికి క్షమాపణలు చెప్పడమే మంచిది. అందుకే ప్రియాంక జైన్, శివకుమార్ మరిహాల్ అనే మేము.. ఎవరి ఫీలింగ్స్ అయితే హర్ట్ చేశామో వారికి సారీ చెప్తున్నాం. ఏదీ కావాలని చేయలేదు. మమ్మల్ని నమ్మి సపోర్ట్ చేయండి. సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేసే ప్రతీది మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే. ఇలా జరిగుండకూడదు. అర్థం చేసుకోండి’ అని నోట్‌లో తెలిపారు ప్రియాంక, శివ్.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×