BigTV English

Kresha Gupta: ఈమె చేతిలో 100 కోట్ల ఫండ్..!

Kresha Gupta: ఈమె చేతిలో 100 కోట్ల ఫండ్..!
Kresha Gupta

Kresha Gupta Young Fund Manager: మదుపరుల డబ్బుకు మార్కెట్లో భద్రత కల్పించి, దానిని వృద్ధి చేయటమే ఫండ్ మేనేజర్ల పని. అయితే.. ఓ 24 ఏళ్ల అమ్మాయి ఏకంగా 100 కోట్ల రూపాయల ఫండ్‌ని ఒంటి చేత్తో నిర్వహిస్తోంది. చార్టెడ్ అకౌంటెంట్‌గా కెరియర్ ప్రారంభించి, ఫండ్ మేనేజర్‌గా సత్తా చాటుతోన్న ఆ యువతేజమే.. క్రేషా గుప్తా.


ప్రస్థానం
మార్కెట్ మందగమనంలో సాగుతుండగా, పేరున్న మార్కెట్ ఎనలిస్టులే పెట్టుబడి పరంగా నిర్ణయాలు తీసుకోలేని వేళ.. క్రేషా ధైర్యంగా ముందడుగు వేసింది. ఏకంగా రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించి సంచలనం సృష్టించింది.

24 ఏళ్ల క్రేషా గుప్తా గత ఐదేళ్లుగా మార్కెట్ ట్రెండ్‌లను అధ్యయనం చేస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కోసం ఆమె రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించారు. భారతదేశపు అతి పిన్న వయస్కులైన ఫండ్ మేనేజర్లలో ఒకరిగా నిలిచారు.


క్రేషా కంపెనీ పేరు.. చాణక్య ఆపర్చునిటీస్ ఫండ్ 1. ఇది ఏటా స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అధిక నెట్‌వర్త్‌ ఉన్న వ్యక్తుల నుంచి నిధులు సేకరించి వాటిని మరో 25 కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టే దిశగా క్రేషా పనిచేస్తోంది.

కేవలం అనుభవమే విజయాన్ని అందించదనీ, నిరంతరం నేర్చుకునే స్వభావం, కొత్త ఆలోచనలకు, మార్పుకు సిద్ధపడటం, ప్రశ్నించే నైజం తన విజయరహస్యాలన క్రేషా చెప్పుకొచ్చింది. స్టార్టప్‌లపై దృష్టి సారించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా ఇన్వెస్టర్‌గా నిలిచారు.

బయోడేటా
పేరు
: క్రేషా గుప్తా
స్వస్థలం: అహ్మదాబాద్‌
చదువు: అహ్మదాబాద్ వర్సిటీ నుంచి బీకాం,
సింబయాసిస్ నుంచి బ్యాంకింగ్ అండ్‌ ఫైనాన్షియల్ సపోర్ట్ సర్వీసెస్‌ డిప్లొమా,
2019లో సీఏ పట్టా
కెరియర్: వోడాఫోన్ ఐడియాలో ఇన్వెస్టర్ రిలేషన్స్ అండ్‌ ట్రెజరీ టీమ్‌ మెంబర్
గత 5 ఏళ్లుగా మార్కెట్ ఎనలిస్ట్

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×