BigTV English

Taxpayers: ఐటీఆర్ అలర్ట్.. ఇవి దాఖలు చేశారా, ఇంకా కొన్ని రోజులే గడువు

Taxpayers: ఐటీఆర్ అలర్ట్.. ఇవి దాఖలు చేశారా, ఇంకా కొన్ని రోజులే గడువు

Taxpayers: ప్రతి ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేయడం తప్పనిసరి. అయితే కొంతమంది పన్ను చెల్లింపుదారులు వారి రిటర్న్‌లలో పొరపాట్లు, లోపాల కారణంగా వారి రిటర్న్‌లను అప్ డేట్ చేసుకునే చాన్సుంది. 2022లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సౌకర్యాన్ని ఆమోదించినప్పటి నుంచి, పన్ను చెల్లింపుదారులు తమ పన్ను రిటర్న్‌లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటున్నారు. కానీ, ఈ అప్‌డేట్లకు సంబంధించి గడువులు కూడా ఉంటాయి. గడువు తేదీలోపు ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించాల్సి ఉంటుంది.


రిటర్న్‌లు ఎందుకు

అప్ డేట్ చేసిన రిటర్న్‌లు పన్ను చెల్లింపు దారులకు అనేక ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా, పన్ను చెల్లింపులలో పొరపాట్లు లేదా ఆదాయాల్లో తప్పులను సరిదిద్దుకుని సరైన పన్ను చెల్లించుకునేందుకు అవకాశం లభిస్తుంది. పన్ను అధికారులు పన్ను ఎగవేతను గుర్తించినప్పుడు, దాన్ని పరిష్కరించడానికి వ్యాజ్యాలు కొనసాగించడం కూడా సులభమవుతుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను అప్ డేట్ చేసుకోవడం ద్వారా ఈజీగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

గడువు ఎప్పుడు..

పన్ను చెల్లింపుదారులు 2022-23 అసెస్‌మెంట్ ఇయర్ లేదా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ రిటర్న్‌లను అప్ డేట్ చేసుకుని మార్చి 31, 2025 లోపు కొత్త ఐటీఆర్‌ను దాఖలు చేయాలి. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయాన్ని ఇవ్వడానికి 2025 బడ్జెట్‌లో 48 నెలల గడువును పెంచారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పన్ను చెల్లింపు దారులు, గడువుకు ముందు తమ రిటర్న్‌లను సమర్పించుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటారు.


Read Also: Gold Duty Free: దుబాయ్ నుంచి గోల్డ్ కొనుగోలు చేస్తే ఎంత సేవ్ చేసుకోవచ్చు.. లిమిట్ ఎంత..

పన్ను చెల్లింపుదారులకు మరిన్ని అవకాశాలు

అప్ డేట్ చేసుకున్న రిటర్న్ లు పన్ను చెల్లింపుదారులకు కొన్ని ప్రత్యేక అవకాశాలను అందిస్తాయి. వారు తమ ఆదాయాన్ని చెల్లించకపోతే లేదా తప్పుగా చెల్లించినప్పటికీ, ఒకసారి రిటర్న్‌ను అప్ డేట్ చేయడం ద్వారా పన్ను లావాదేవీలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చు. పన్ను చెల్లింపుదారులు తమ గత రిటర్న్‌లలో తప్పులు లేదా పొరపాట్లను గుర్తించినప్పుడు వాటిని మళ్లీ మార్పు చేసుకుని రిటర్న్‌ను దాఖలు చేయడం ద్వారా అవి సరిదిద్దుకోవచ్చు.

రిటర్న్‌లకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలు

  • 2021-22, 2022-2 3 ఆర్థిక సంవత్సరం కోసం రిటర్న్‌లను మార్చి 31, 2025 లోపు దాఖలు చేయాలి.
  • గతంలో పన్ను చెల్లించకపోవడం లేదా తప్పుగా చెల్లించిన పన్ను వల్ల పన్ను చెల్లింపుదారులపై వ్యాజ్యాలు రావచ్చు. కానీ అప్ డేట్ చేసిన రిటర్న్‌లు ఈ వ్యాజ్యాలను నివారించడానికి సహాయపడతాయి.
  • ఒక వ్యక్తి సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరానికి సెక్షన్ 139(3) కింద నష్టానికి సంబంధించిన రిటర్న్‌ను దాఖలు చేసినప్పటికీ, అప్డేట్ చేసిన రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. కానీ ఆ రిటర్న్ నష్టానికి సంబంధించిన పన్ను రిటర్న్ కాకూడదు. అయితే మళ్లీ మార్చి 31 తర్వాత కూడా గడువు ఇస్తారా అంటే మాత్రం చెప్పలేం.

Read Also: Women’s Day Sale: ఉమెన్స్ డే ఆఫర్ సేల్.. రూ.7 వేలకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్

Tags

Related News

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Big Stories

×