E-Paper
Advertisement

వైష్ణోదేవి నుంచి తిరుపతి వరకు.. ఇక్సిగో కొత్త ‘భారత్ దర్శన్’ ప్యాకేజీలు!

వైష్ణోదేవి నుంచి తిరుపతి వరకు.. ఇక్సిగో కొత్త ‘భారత్ దర్శన్’ ప్యాకేజీలు!
Advertisement

Ixigo Bharat Darshan Tour Packages: ప్రముఖ ఆన్‌ లైన్ ట్రావెల్ ప్లాట్‌ ఫామ్ ఇక్సిగో కొత్త సర్వీసును ప్రారంభించింది. ఇప్పటి వరకు రైలు, విమాన, బస్సు టికెట్ల బుకింగ్‌ కు ఎక్కువగా ఉపయోగపడిన ఈ ప్లాట్‌ ఫామ్ ఇప్పుడు ప్యాకేజ్డ్ హాలిడేస్ విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఇక్సిగో భారత్ దర్శన్’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రలు, కుటుంబ విహారయాత్రలను ఈజీగా ప్లాన్ చేసుకునేలా ఈ సర్వీసును  రూపొందించారు.

ఒకే ప్యాకేజీలో అన్ని సదుపాయాలు

సాధారణంగా తీర్థయాత్ర లేదంటే ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసుకోవాలంటే రైలు టికెట్, హోటల్, భోజనం, స్థానిక ప్రయాణం, టూరిస్ట్ స్పాట్స్ సందర్శన లాంటి వాటిని విడివిడిగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా సమయం పడుతుంది, ప్లానింగ్‌లో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఈ సమస్యను తగ్గించడమే భారత్ దర్శన్ టూర్ ప్యాకేజీల ప్రధాన ఉద్దేశం. ఒకే ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, భోజనం, సందర్శనీయ ప్రాంతాలు, స్థానిక రవాణాను అందిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ప్రతి అంశాన్ని విడిగా చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే ప్యాకేజీని ఎంచుకోవచ్చు.

IRCTC భాగస్వామ్యంతో ప్యాకేజీలు

Advertisement

ఈ టూర్ ప్యాకేజీలను ఇక్సిగో, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సహకారంతో రూపొందించింది. ప్రయాణికులు ఇక్సిగో ట్రైన్స్ యాప్ ద్వారా ఈ ప్యాకేజీలను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణాన్ని బేస్ చేసుకుని పూర్తి టూర్ ఎక్స్ పీరియెన్స్ ను అందించాలనేది కంపెనీ ఆలోచన. ముఖ్యంగా రైళ్లపై ఆధారపడే కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు, తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణికులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వైష్ణోదేవి నుంచి తిరుపతి వరకు!

ప్రారంభ దశలోనే దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను భారత్ దర్శన్ ప్యాకేజీల్లో చేర్చారు. వైష్ణో దేవి, అయోధ్య, చార్ ధామ్, తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్రాలకు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు కాశ్మీర్, ఈశాన్య భారతం లాంటి కుటుంబ విహారయాత్రలకు అనువైన ప్రాంతాలను కూడా ఈ సర్వీసులో చేర్చారు. దీంతో భక్తి యాత్రలతో పాటు సాధారణ హాలిడే ట్రిప్ కోరుకునే వారికి కూడా ఎంపికలు లభిస్తాయి.

రూ.6,990 నుంచే ప్యాకేజీలు

Advertisement

గమ్యస్థానం, ప్రయాణ వ్యవధి, ప్యాకేజీలో ఉన్న సదుపాయాలను బట్టి ధరల్లో తేడా ఉంటుంది. కంఫర్ట్, సుపీరియర్ అనే కేటగిరీల్లో ప్యాకేజీలను అందిస్తున్నారు. ప్రారంభ ధరలు సుమారు రూ.6,990 నుంచి ఉండగా, ఎక్కువ రోజుల పాటు కొనసాగే ప్రీమియం ప్యాకేజీల ధరలు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్యాకేజీని ఎంచుకోవచ్చు.

ఇప్పటివరకు ప్రయాణానికి సంబంధించిన ఒక్కో సర్వీసును బుక్ చేసుకునే ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ఇక్సిగో.. ఇప్పుడు పూర్తి టూర్ ఎక్స్ పీరియెన్స్ అందించే దిశగా అడుగులు వేస్తోంది. దేశీయ పర్యాటకం, తీర్థయాత్రలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఈ కొత్త సర్వీస్ ఇక్సిగోకు కొత్త మార్కెట్‌ను తీసుకొస్తుందని భావిస్తున్నారు.

Read Also: ప్రకృతి అందాల నడుమ వందేభారత్ ప్రయాణం.. ఈ 6 రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Tags

Related News

దేశంలోనే తొలి రెడ్ రోడ్.. దట్టమైన అడవిలో దీన్ని ఎందుకు వెశారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే.. రూ.25,000 కోట్ల మెగా ప్లాన్!

షాప్ ఓపెనింగ్‌లో రోబో తీన్మార్ డ్యాన్స్.. స్టెప్పులు చూసి జనం ఫిదా!

ప్రకృతి అందాల నడుమ వందేభారత్ ప్రయాణం.. ఈ 6 రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

షాకింగ్ స్మగ్లింగ్ ప్లాన్.. నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్.. ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ప్రయాణికుడు!

రైలులో మందుకొట్టిన ప్రయాణికులు.. ఫిర్యాదు చేసినా చర్యలేవీ?

క్యాబ్‌పై కూర్చుని వర్క్.. ఈ ఐటీ ఉద్యోగి కేక!

Big Stories

Advertisement
×