Philips 55PUT8115 94 55 inch 4K TV: ఇంట్లోనే థియేటర్ స్థాయి ఎంటర్ టైన్మెంట్ కావాలనుకునే వారికి పెద్ద స్క్రీన్ టీవీలు బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా 55-ఇంచ్ విభాగంలో.. అద్భుతమైన విజువల్స్, లేటెస్ట్ ఫీచర్లు, నమ్మకమైన బ్రాండ్ కోరుకునే వారికి ఫిలిప్స్ 55-ఇంచ్ 4K HDR LED ఆండ్రాయిడ్ టీవీ ఒక అద్భుతమైన ఆప్షన్ గా నిలుస్తుంది. సూపర్ పిక్చర్ క్వాలిటీ, ఆకట్టుకునే .. సౌండ్ సిస్టమ్ , గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్.. సిస్టమ్‌తో వస్తున్న ఈ మోడల్ మార్కెట్లో ఏమేరకు ఉపయోగకరమో ఇప్పుడు చూద్దాం.
ఈ టీవీలో ప్రధాన ఆకర్షణ దీని 55-ఇంచ్ 4K ఆల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే. ఇందులో.. ఫిలిప్స్ స్వంత P5 పర్ఫెక్ట్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉంది. ఇది ప్రతి సీన్‌లోని రంగులు, కాంట్రాస్ట్, డిటైలింగ్‌ను అత్యంత స్పష్టంగా చూపిస్తుంది. HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం వల్ల ఓటీటీ యాప్స్‌లో సినిమాలు చూస్తున్నప్పుడు థియేటర్ తరహా ఫీల్ లభిస్తుంది. చీకటి సీన్లలో కూడా డిటైలింగ్ మిస్ కాకుండా చక్కటి నల్లటి రంగులను ఈ స్క్రీన్ అందిస్తుంది.
విజువల్స్‌తో పాటు.. ఆడియో కూడా ఈ టీవీలో చాలా బాగుంటుంది. ఇందులో డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్‌తో.. కూడిన 20W స్పీకర్లు ఉంటాయి. సాధారణ టీవీ స్పీకర్ల కంటే.. క్లియర్ డైలాగ్స్, చుట్టూ వినిపించే సౌండ్ ఎఫెక్ట్ ఈ టీవీ ప్రత్యేకత. మీరు యాక్షన్ సినిమాలు చూస్తున్నా లేదా మ్యూజిక్ వీడియోస్ వింటున్నా సౌండ్ బార్ లేకుండానే మంచి ఆడియో ఫీల్ లభిస్తుంది.
ఈ మోడల్ అధికారిక ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. దీని వల్ల గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి వేలాది యాప్‌లను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్న ఇన్-బిల్ట్ వాయిస్ రిమోట్ ద్వారా వాయిస్ కమాండ్స్‌తో.. టీవీని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. అంతేకాకుండా ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్ ఉండటం వల్ల మీ స్మార్ట్ ఫోన్ లోని ఫోటోలు, వీడియోలను నేరుగా పెద్ద స్క్రీన్‌పై ప్లే చేయవచ్చు.
ఈ టీవీలో కనెక్టివిటీకి ఎలాంటి లోటూ లేదు. ఇందులో 4 హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి, వీటి ద్వారా గేమింగ్ కన్సోల్స్, సెట్-టాప్ బాక్స్, పెన్ డ్రైవ్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్-బ్యాండ్ వై-ఫై , బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వేగవంతమైన స్ట్రీమింగ్‌కు సహాయ పడతాయి. గేమర్స్ కోసం తక్కువ లాగ్ టైమ్ ఆఫర్ చేసే ఆటోలో లాటెన్సీ మోడ్ కూడా ఇందులో ఉంది.
Also Read: కిచెన్‌లో కింగ్ లాంటి టాప్ మైక్రోవేవ్ ఓవెన్లు..అన్ని వంటకాలు చిటికెలో!
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఫిలిప్స్ సుమారు రూ. 42,999 నుంచి రూ. 46,999 ధరలకు లభిస్తోంది. పండగ ఆఫర్లు లేదా బ్యాంక్ డిస్కౌంట్లలో ఇది మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ప్రీమియం 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ ఆడియో, పూర్తి ఆండ్రాయిడ్ టీవీ ఫీల్ కోరుకునే వారికి ఈ ఫిలిప్స్ 55-ఇంచ్ టీవీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్.
మీ ఇంటి లివింగ్ రూమ్‌కి ఒక సరైన ప్రీమియం లుక్ ఇస్తూ, ఫ్యామిలీతో కలిసి సినిమా థియేటర్ ఫీల్ పొందడానికి ఫిలిప్స్ 55-ఇంచ్ 4K HDR ఆండ్రాయిడ్ టీవీ బెస్ట్ అని చెప్పొచ్చు. బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే ప్రతీ ఒక్కరూ ఈ మోడల్‌ను కొనొచ్చు.