BigTV English

Upcoming Mahindra Electric SUV’s: మార్కెట్ దద్దరిల్లిపోవాల్సిందే.. జాతరకు సిద్ధమైన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు.. ఇతరులు పోటీని తట్టుకోగలరా..?

Upcoming Mahindra Electric SUV’s: మార్కెట్ దద్దరిల్లిపోవాల్సిందే.. జాతరకు సిద్ధమైన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు.. ఇతరులు పోటీని తట్టుకోగలరా..?
Advertisement

Upcoming Mahindra Electric SUV’s in Indian Market: భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు సూపర్ క్రేజ్ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెరిగిపోయిన తరుణంలో ఎలక్ట్రిక్ కార్లపై వాహన ప్రియులు ఆసక్తి చూపించారు. అదే సమయంలో వాటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇదే క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎస్యూవీ వెహికల్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీలను అభివృద్ధి చేస్తుంది. ఇక త్వరలో ఈ కంపెనీ పలు ఎలక్ట్రిక్ ఎస్యూవీలను మార్కెట్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


మహీంద్రా స్కార్పియో.e:

త్వరలో మహీంద్రా కంపెనీ నుంచి విడుదలవుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీలలో స్కార్పియో-ఎన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ముందు వరుసలో ఉంది. ఈ వెహికల్‌కి స్కార్పియో.e అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎస్యూవీ INGLOకి మోడిఫైడ్ వెర్షన్‌లో రానున్నట్లు సమాచారం. అయితే ఈ స్కార్పియో.ఇ వేరియంట్‌కు సంబందించిన పవర్‌ట్రెయిన్ వివరాలు ఇంకా తెలియరాలేదు.


కానీ అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఇది 109 bhp, 135 nm టార్క్‌ని ఉత్పత్తి చేసే ఫ్రంట్-మౌంటెడ్ మోటార్ ఉంటుంది. అలాగే ఆల్‌వీల్‌ డ్రైవ్‌లో 286bhp, 535 nm టార్క్‌ని ఉత్పత్తి చేసే మోటారును కలిగి ఉంటుంది. ఇది 325 కిమీ నుంచి 450 కి.మీ మైలేజీని అందిస్తుంది.

Also Read: 5 Star Rating Tata Cars: టాటా కార్లా మజాకా.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ మోడళ్లకు 5-స్టార్‌ రేటింగ్స్..!

మహీంద్రా ఎక్స్‌యూవీ.e8:

ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ.e8 కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఆర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌గా వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిని ఇప్పటికే టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్‌యూవీ 450 కి.మీ నుంచి 500కి.మీ మైలేజీ అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది డ్యూయల్ మోటార్ సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఎక్స్‌యూవీ ఈ ఏడాది చివరికల్లా లాంచ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మొదటి మహీంద్రా నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే అవుతుంది.

మహీంద్రా బొలెరో.e:

త్వరలో బొలెరో కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో మార్కెట్‌లోకి రానుంది. దీనికి కూడా బొలెరో.ఇ అనే పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బొలెరో.ఇ కొత్త కారు 325కి.మీ నుంచి 450 కి.మీ మైలేజీని అందించే అవకాశం ఉంది.

Also Read: Best Cars under Rs 5 lakh: మిడిల్ క్లాస్ కార్లు.. బైక్ కంటే ఇవే బెటర్!

మహీంద్రా థార్‌.e:

దేశీయ ఆటో మార్కెట్‌లో మహీంద్రా థార్‌కి అద్భుతమైన క్రేజ్, డిమాండ్ ఉంది. ఇది అతి త్వరలోనే ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారుకు Thar.e గా పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇది కూడా INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,775 mm, 2,975 mm మధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ కార్ మొత్త 5డోర్ల ఆప్షన్లలో మార్కెట్‌లోకి వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తుంది. అందులో ఒకటి 60కెడబ్ల్యూహెచ్. ఇది 325 కి.మీ మైలేజీని అందిస్తుంది. అలాగే మరోకటి 80కెడబ్ల్యూహెచ్. ఇది 435 కి.మీ నుంచి 450 కి.మీ మైలేజీని అందిస్తుంది.

Tags

Related News

Jio Utsav Sale: జియో ఉత్సవ్ మొదలైంది.. ఈ వస్తువులపై బంపర్ డిస్కౌంట్

Amazon Great Indian Festival: అమెజాన్ వీకెండ్ వచ్చేసిందోచ్చ్.. 50శాతం నుండి 72శాతం వరకు తగ్గింపు

Festival Of Electronics: రిలయన్స్ డిజిటల్‌లో ‘ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్’, నమ్మలేనంత తక్కువ ధరలు.. ఇంకెందుకు ఆలస్యం !

Gold rate Dropped: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

JioMart Offer: రెండు రోజులు మాత్రమే.. జియోమార్ట్‌లో కేవలం రూ.99 నుంచే బ్యూటీ ప్రోడక్ట్స్‌

BSNL Offers: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు దీపావళి బొనాంజా.. లక్కీ డ్రాలో 10 గ్రాముల సిల్వర్ కాయిన్.. భారీ తగ్గింపులు

Redmi K90 Pro Max: రెడ్ మీ నుంచి క్రేజీ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

JioFinance Offer: ఫ్రీగా బంగారం.. జియో ఫైనాన్స్ అదిరిపోయే ఆఫర్!

Big Stories

×