BigTV English

Rahul Gandhi: రాహుల్ గాంధీ వదులుకునే ఎంపీ సీటు ఇదే..! బైపోల్ బరిలో ప్రియాంక..

Rahul Gandhi: రాహుల్ గాంధీ వదులుకునే ఎంపీ సీటు ఇదే..! బైపోల్ బరిలో ప్రియాంక..

Rahul Gandhi To Give Up Wayanad Seat: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వదులుకునే సీటుపై స్పష్టత వచ్చింది. వయనాడ్, రాయ్‌బరేలిలో పోటీ చేసి రెండు చోట్ల ఘనవిజయం సాధించిన రాహుల్ ఏ సీటు వదులుకోవాలనే అంతర్మథనంతో ఉన్నారు. తాజాగా దానికి తెరపడింది. రాహుల్ వయనాడ్ సీటు వదులుకున్నట్లు మల్లిఖార్జున ఖర్గు తెలిపారు. వయనాడ్ బైపోల్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.


2019లో అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాహుల్ గాంధీ తన స్థావరాన్ని కేరళలోని వయనాడ్‌కు మార్చారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసి 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో బంపర్ విక్టరీ సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలి రెండు చోట్ల పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు.

తాజాగా రాహుల్ గాంధీ వయనాడు సీటును వదులుకోనున్నట్లు తెలుస్తోంది. యూపీలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచాలంటే రాహుల్ గాంధీ రాయ్‌బరేలి ఎంపీగా ఉండటమే శ్రేయస్కరమని ఆ పార్టీ అధిష్టానం భావించింది. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ సీటును వదులుకుంటారని ఖర్గే తెలిపారు.


సోనియా గాంధీ 2004 నుంచి ఈ ఏడాది మొదట్లో రాజ్యసభకు వెళ్లే వరకు రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడంతో రాయ్‌బరేలీ బరిలో ఎవరుంటానే సందిగ్ధత కొనసాగింది. ముందుగా అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే వార్తలు చెక్కర్లు కొట్టాయి. కానీ చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ పోటీకి సుముఖంగా లేరని తెలియడంతో రాయ్‌‌బరేలి బరిలో రాహుల్ నిలిచారు.

Also Read: ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసుంటే మోదీ ఓటమి పక్కా.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!

రాయ్‌బరేలీ నుంచే ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో రాయ్‌బరేలీని కాంగ్రెస్ కంచుకోటగా అభివర్ణిస్తారు.

ఇటీవల రాహుల్ గాంధీ కేరళలోని మలప్పురంలోని బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలో రాహుల్ గాంధీ వయనాడ్‌ను వదులుకుంటున్నట్లు హింట్ ఇచ్చారు. వయనాడ్ ప్రజలు తనకు దేవుడితో సమానం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది రెండు నియోజకవర్గాల ప్రజల సంతోషం కోసమే అని స్పష్టం చేశారు.

Related News

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

×