BigTV English

Maruti Suzuki Alto K10 CNG Finance: మారుతి ఆల్టో కె10.. రూ.లక్షకే ఇంటికి తీసుకెళ్లొచ్చు.. ఎలానో తెలుసా?

Maruti Suzuki Alto K10 CNG Finance: మారుతి ఆల్టో కె10.. రూ.లక్షకే ఇంటికి తీసుకెళ్లొచ్చు.. ఎలానో తెలుసా?

Maruti Suzuki Alto K10 CNG Finance: మీరు తక్కువ ధరలో మంచి సీఎన్‌జీ కారును కొనాలని చూస్తున్నారా? సీఎన్‌జీ కారు అంటే మీ మనసు మళ్లీ మళ్లీ మారుతీ సుజుకి ఆల్టో కె10 వైపు వైళుతుందా? అయితే మీకో శుభవార్త ఉంది. ఇప్పుడు మారుతి LXI S-CNG, VXI S-CNG వంటి రెండు వేరియంట్‌లను ఈజీ ఫైనాన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ.1 లక్ష  డౌన్ పేమెంట్ తర్వాత కారును మీ సొంతం చేసుకోవచ్చు. Alto K10 CNGకి ఫైనాన్స్‌లో కొనుగోలు చేయడానికి ఎంత లోన్ లభిస్తుంది. వడ్డీ రేటు ఎంత, నెలవారీ వాయిదా, కారు ఫీచర్లు తదితర వివరాలను తెలుసుకుందాం.


మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి గురించి మాట్లాడితే ఈ 5 సీట్ల కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 998 సిసి ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 55.92 బిహెచ్‌పి పవర్, 82.1 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఆల్టో కె10 సిఎన్‌జి మైలేజ్ 33.85 కిమీ/కిలో వరకు ఉంటుంది. ఆల్టో కె10 సిఎన్‌జి ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.74 లక్షల నుండి రూ. 5.96 లక్షల వరకు ఉంది.

Also Read: Skoda Discounts: ఊహించని ఆఫర్.. ఈ కారుపై రూ.2.5 లక్షల డిస్కౌంట్.. 4 రోజులే ఛాన్స్!


మారుతి ఆల్టో K10 LXI S-CNG ఆన్-రోడ్ ధర రూ. 6.24 లక్షలు. మీరు రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్‌తో ఫైనాన్స్ చేస్తే మీరు 9 శాతం వడ్డీ రేటుతో రూ. 5.24 లక్షల కారు లోన్ పొందవచ్చు. దీని తర్వాత మీరు 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,877 EMIగా చెల్లించాలి. మీరు పైన పేర్కొన్న నిబంధనలతో మారుతి ఆల్టో K10 CNGఈ వేరియంట్‌కు ఫైనాన్స్ చేస్తే మీరు 5 సంవత్సరాలలో రూ. 1.28 లక్షల వడ్డీని మొత్తంగా చెల్లిస్తారు.

మారుతి సుజుకి ఆల్టో K10 VXI S-CNG ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 6.49 లక్షలు. మీరు ఈ ఆల్టో CNG వేరియంట్‌ను రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చేసి కొనుగోలు చేస్తే మీరు రూ. 5.49 లక్షల రుణం తీసుకోవాలి. 5 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే  వడ్డీ రేటు 9 శాతం అయితే మీరు 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా EMIగా రూ.11,396 చెల్లించాలి.

Also Read: Bajaj All Bikes On Flipkart: బజాజ్ సంచలన నిర్ణయం.. ఫ్లిప్‌కార్ట్ నుంచి బైకులను ఆర్డర్ చేయవచ్చు!

పై నిబంధనల ప్రకారం మారుతి ఆల్టో కె10 విఎక్స్‌ఐ సిఎన్‌జికి ఫైనాన్సింగ్‌పై వడ్డీ 5 సంవత్సరాలలో దాదాపు రూ. 1.35 లక్షలు అవుతుంది. Alto K10 CNGకి ఫైనాన్సింగ్ చేయడానికి ముందు సమీపంలోని మారుతి సుజుకి అరేనా డీలర్‌షిప్‌ని సందర్శించండి. కారు లోన్, EMIతో సహా అన్ని వివరాలను చెక్ చేయండి.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×