Big Stories

New Generation Swift Launch 2024: రేపే లాంచ్ కానున్న కొత్త స్విఫ్ట్.. కొనేముందు ఇవి తెలుసుకోండి!

New Generation Swift Launch 2024: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎంతో ప్రత్యేకమైంది. దీని కొత్త మోడల్ రేపు అనగా మే 9, 2024న లాంచ్ కానుంది. మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ గురించి ఒక్కొక్కటిగా సమాచారాన్ని అందిస్తోంది. కంపెనీ ఇటీవలే దాని వేరియంట్లు, కలర్స్ వివరాలను వెల్లడించింది. కొత్త కారు LXi, VXi, VXi (O), ZXi, ZXi+ వేరియంట్‌లలో రానుంది. అయితే తొమ్మిది కలర్స్ రెండు కొత్త కలర్స్ – లస్టర్ బ్లూ, నావెల్ ఆరెంజ్ ఇందులో ఉన్నాయి. దేశంలో లాంచ్ కానున్న కొత్త హ్యాచ్‌బ్యాక్ జపాన్, UK మోడల్‌లను పోలిన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. అయితే కొత్త స్విఫ్ట్ కోసం రూ.11వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలి.

- Advertisement -

మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మే 9న విడుదల చేయనుంది. దీని బుకింగ్ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు మారుతి సుజుకి డీలర్‌షిప్‌‌లో రూ. 11,000 టోకెన్‌తో కారును బుక్ చేసుకోవచ్చు. కొత్త స్విఫ్ట్‌లో హైబ్రిడ్ ఇంజన్ లభిస్తుంది. ఫ్రంట్ ఫాగ్ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. క్యాబిన్‌లో కొత్త 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. కంపెనీ కొత్త స్విఫ్ట్‌తో ADAS అంటే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను అందించడం లేదు.

- Advertisement -

Also Read : కాంపాక్ట్ SUVలలో ఇదే తోపు.. లీటర్‌కు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా?

కొత్త తరం సుజుకి స్విఫ్ట్‌లో మార్పులు చేసింది. కారు ముందు భాగంలో షార్ప్ లుక్ హెడ్‌ల్యాంప్స్ ఇచ్చారు. కారు పెద్ద సైజు గ్రిల్‌ను కలిగి ఉంది . దీని తర్వాత ప్రొజెక్టర్ సెటప్, LED DRL ఉన్నాయి.  టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన స్విఫ్ట్‌కు ADAS ఇవ్వబడింది. అయితే ఈ ఫీచర్ ధర కారణంగా భారతీయ మార్కెట్లో తీసుకురావడం లేదు. మొత్తంమీద  ఈ కారు చాలా అకర్షణీయంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

కొత్త తరం స్విఫ్ట్‌తో కంపెనీ కొత్త మూడు-సిలిండర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో CVT గేర్‌బాక్స్ ఉంటుంది. సుజుకి ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను త్వరలో జపాన్‌లో విడుదల చేయబోతోంది. దీని ఇంజన్ Z12E సిరీస్‌లో ఉంది. ఈ ఇంజన్ ప్రస్తుతం ఉన్న K12C 1.2-లీటర్ పెట్రోల్ స్థానంలో ఉంది. కొత్త తరం స్విఫ్ట్ 82 hp పవర్‌ని ఉత్పత్తి చేసే కొత్త Z12E ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఒక లీటర్ పెట్రోల్‌లో సుమారు 26 కి.మీ మైలేజీని ఇస్తుంది.

Also Read : 170 కిమీ రేంజ్‌తో రూ.79 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. మే 10 నుంచి బుకింగ్స్!

కొత్త తరం స్విఫ్ట్ బాడీ అంతటా కనిపించే క్యారెక్టర్ లైన్‌లను కలిగి ఉంది. ఇవి హెడ్‌ల్యాంప్‌లతో అందంగా కలిసి పోతాయి. కారు రూఫ్‌లైన్ అలానే ఉంటుంది. అయితే ఇందులో కొత్త డోర్‌లు ఉంటాయి. ప్రత్యేకించి బ్యాక్ డోర్ A-పిల్లర్‌కు దూరంగా ఉంటాయి. కారు వెనుక భాగంలో కూడా చాలా మార్పులు చేశారు. బంపర్, టెయిల్‌గేట్‌లో పెద్ద చేంజెస్ కనిపిస్తాయి. టోక్యో మోటార్ షోలో కనిపించిన స్విఫ్ట్ హైబ్రిడ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News