Heavy rains for Telugu states: గత నాలుగైదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. రుతపవనాలు చురుగ్గా కదలడం.. బంగాళఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన పరిస్థితుల వల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం చిత్తడిచిత్తడై పోతుంది. రోడ్లపైకి భారీ వరద నీరు చేరుతుండడంతో భాగ్యనగర వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు భారీ వర్షాలు, మరో వైపు ట్రాఫిక్ సమస్యలతో వాహనదారుల సతమతమవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలర్ట్ చేసింది.
⦿ మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..
మరో నాలుగు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చెరువులు నిండిపోతున్నారు. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో గేట్లను తెరిచి నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు.
⦿ హైదరాబాద్‌లో ఇది పరిస్థితి..
హైదారాబాద్ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీ వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం ఇంటికి వెళ్లాల్సిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లోని ఇరుక్కుపోయిన సంఘటనలు ఎదురువుతున్నాయి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇతర ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. ఇక పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరుతుండడంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన ఏర్పడిన పరిస్థితి నెలకొంది.
⦿ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో లోలెవల్ వంతెనలు మునిగిపోయాయి. ఇక మున్నేరులో వరద ప్రవాహం కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు నిండి వరద నీటి ఉదృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
⦿ ఏపీలో కూడా భారీ వర్షాలు..
ఇక.. ఏపీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 29 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ ఏపీపై పడుతోంది. దీంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.
ALSO READ: Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల
ALSO READ: Viral Video: హైదరాబాద్‌లో రోడ్లపై డేంజర్ స్టంట్స్ చేశారు.. చివరకు..! సోషల్ మీడియాలో వీడియో వైరల్