BigTV English
Advertisement

May 2025 Bank Holidays: మే 2025లో బ్యాంక్ సెలవులు..ఎన్ని ఉన్నాయో తెలుసా..

May 2025 Bank Holidays: మే 2025లో బ్యాంక్ సెలవులు..ఎన్ని ఉన్నాయో తెలుసా..

May 2025 Bank Holidays: ప్రతి నెలలో బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక పనుల కోసం బ్యాంకులకు వెళ్ళే వారు సెలవుల గురించి ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటి గురించి ముందే తెలుసుకుంటే ఇబ్బందులు లేకుండా బ్యాంకు పనులను ఈజీగా నిర్వహించుకోవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మే 2025కి సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, మే నెలలో శనివారాలు, ఆదివారాలతో కలిపి దాదాపు 12 నుంచి 13 రోజుల వరకు బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి, ఎందుకంటే ప్రాంతీయ పండుగలు, సాంస్కృతిక వేడుకలు ఈ సెలవులను నిర్ణయిస్తాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


మే 2025లో బ్యాంకు సెలవులు

మే 1, 2025 (గురువారం) – కార్మిక దినోత్సవం
మే 1న కార్మిక దినోత్సవం (లేబర్ డే) దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇదే రోజు మహారాష్ట్ర రాష్ట్ర ఆవిర్భావ దినం కూడా. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, గోవా, మణిపూర్, గుజరాత్, కేరళ, త్రిపుర కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అసోం ప్రాంతాల్లో బ్యాంకులకు హాలిడే.


మే 4, 2025 (ఆదివారం) – వారాంతపు సెలవు
దేశవ్యాప్తంగా ఆదివారం వీకెండ్ సెలవు కావడంతో అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.

మే 8, 2025 (బుధవారం) – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
ప్రముఖ కవి, సాహిత్యవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్, త్రిపుర, న్యూఢిల్లీ, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో సెలవు

మే 10, 2025 (శనివారం) – రెండో శనివారం
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ప్రతి నెల రెండో, నాల్గో శనివారాలు బ్యాంకులకు సెలవు రోజులు

Read Also: Tech News: ఇంటర్నెట్ లేకుండా వినోదం..D2M టెక్నాలజీతో చౌక … 

మే 11, 2025 (ఆదివారం) – వారాంతపు సెలవు
ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

మే 12, 2025 (సోమవారం) – బుద్ధ పూర్ణిమ
బుద్ధ పూర్ణిమ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు (మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మొదలైనవి).

మే 18, 2025 (ఆదివారం) – వారాంతపు సెలవు
ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

మే 24, 2025 (శనివారం) – నాల్గో శనివారం
నెలలో నాల్గో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

మే 25, 2025 (ఆదివారం) – వారాంతపు సెలవు
ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

మే 26, 2025 (సోమవారం) – కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి
ప్రముఖ బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా ఈ రోజు త్రిపురలో బ్యాంకులకు సెలవు

మే 29, 2025 (గురువారం) – మహారాణా ప్రతాప్ జయంతి
చరిత్ర ప్రసిద్ధ రాజపుత యోధుడు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులు మూసివేయబడతాయి.

బ్యాంకు సెలవుల సమయంలో ఆర్థిక లావాదేవీలు
సెలవు రోజుల్లో బ్యాంకు బ్రాంచ్‌లు మూసివేయబడినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఆర్‌బీఐ స్పష్టం చేసిన ప్రకారం, సెలవు రోజుల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. కాబట్టి, బ్యాంకు శాఖలకు వెళ్లకుండానే కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలను సులభంగా నిర్వహించవచ్చు. ఉదాహరణకు, యూపీఐ ద్వారా డబ్బు బదిలీ, బిల్ చెల్లింపులు, లేదా ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ వంటివి సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయి.

Related News

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Dak Sewa App: ఇక మీ పాకెట్ లో పోస్ట్ ఆఫీస్ సేవలు.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన తపాలాశాఖ

Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..

Jio Offer: జియో కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?

Big Stories

×