BigTV English

Mercedes eqa 250 Plus: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 560 కి.మీ రేంజ్‌.. మెర్సిడెస్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌!

Mercedes eqa 250 Plus: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 560 కి.మీ రేంజ్‌.. మెర్సిడెస్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌!

Mercedes eqa 250 Plus Launched In India: ఇప్పుడంతా ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. కొత్త కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు మార్కెట్‌లో లాంచ్ అయి వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు ప్రతీది తమ కార్లను తీసుకొస్తూ మార్కెట్‌లో హవా చూపించాలని చూస్తున్నాయి. అదే తరుణంలో వాహన ప్రియులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ఆసక్తి చూపడంతో కంపెనీలు అదిరిపోయే ఫీచర్లను తమ వాహనాల్లో అందించి అదరగొడుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మరో ఎలక్ట్రిక్ మోడల్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది.


మెర్సిడెస్ బెంజ్ తన ఈక్యూ లైనప్‌లో ఉన్న ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తాజాగా దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. కంపెనీ దీనిని రూ.66 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ‘ఈక్యూఏ 250+’ అనే వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారు మొత్తం 7 కలర్ ఆప్షన్లను పొందింది. కాగా ఈ ఈక్యూఏ 250+ దాని మునిపటి మోడల్‌ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు ముందు భాగంలోని ఫీచర్లు కారుకి మరింత అద్భుతమైన లుక్స్‌ని అందిస్తాయి.

Also Read:  మహీంద్రా ఎక్స్యూవీ కారుపై రూ. 2 లక్షల భారీ డిస్కౌంట్.. ఆఫర్ ఎంత వరకు ఉంటుందంటే?


ఈక్యూఏ 250+ కారులో 19 అంగుళాల ఏఎమ్‌జీ లైట్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. అంతేకాకుండా ఈ కారులో ట్విన్ డిస్‌ప్లేలను అందించారు. ఈ డిస్‌ప్లేలు లేటెస్ట్ ఎంబియుఎక్స్ జెన్ 2 సాఫ్ట్‌వేర్‌తో వర్క్ చేస్తాయి. ఈ కారు గ్రిల్‌కి రెండువైపులా ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్‌లతో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, బ్లూ కలర్ ఎలిమెంట్ ఉన్నాయి. అలాగే ఇందులో హెడ్ అప్ డిస్ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 5 USB ఛార్జింగ్ పోర్ట్‌లు అందించారు. అంతేకాకుండా ఇన్‌ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో వస్తుంది.

ఈ ఫీచర్ లాంగ్ డ్రైవ్ చేసేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డాల్బీ అట్మోస్‌ను సపోర్ట్ చేసే 710 వాట్ల బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్‌తో 12 స్పీకర్లతో వస్తుంది. కాగా ఈ ఈక్యూఏ 250+ కారు మెర్సిడెస్ ఈక్యూ లైనప్‌లో చాలా చిన్నదైనది. ఈ కారు సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 190బిహెచ్‌పి పవర్, 385 ఎన్‌ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా ఈ కారు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 8.6 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. ఈక్యూఏ 250+ కారు గంటకు 160 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. కాగా ఇందులో 70.5 కిలో వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని అమర్చారు. అందువల్ల ఈ బ్యాటరీకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే సుమారు 560 కిలో మీటర్ల మైలేజీ అందిస్తుంది. ఈ బ్యాటరీ 100 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కి మద్దతిస్తుంది.

Tags

Related News

Top 6 Clothing Brands: జుడియో తరహాలోనే వీటిలో కూడా దుస్తులు చాలా చీప్, వెంటనే ట్రై చెయ్యండి!

SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్

Zudio షోరూమ్‌కు ఎందుకంత క్రేజ్? ధరలు ఎందుకంత తక్కువ?

Gold Rate Today: కాస్త ఊరటగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే

CIBIL Score: లోన్ తీసుకునేవారికి తీపికబురు.. సిబిల్ స్కోర్ తప్పనిసరికాదు

Gold saving schemes: పొదుపుతో బంగారం సొంతం.. మీ కోసమే టాప్ స్కీమ్స్.. డోంట్ మిస్!

Big Stories

×