Big Stories

Modi Russia Tour : రష్యాలో పర్యటించిన మోడీ.. మంచి జరిగింది వాళ్లకా ? మనకా ?

Modi Russia Tour updates(Political news telugu): ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఆలింగనాలు.. ముచ్చట్లు.. బ్యాటరీ వాహనాల్లో ప్రయాణాలు.. కలిసి ప్రకృతి అందాలను చూడటాలు.. ఒకరినొకరు ప్రశంసించుకోవడం.. ఇలా జరిగాయి. కానీ ఈ పర్యటన ప్రపంచ దేశాలకు ఓ పెద్ద సందేశాన్ని ఇచ్చింది. ఇండియాకు కొన్ని విషయాల్లో దౌత్య విజయం దక్కేలా చేసింది. కొందరికి కడుపులో మండుతున్నా ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కునేలా చేసింది. ఇంతకీ రష్యాలో మోడీ ఏం చేశారు ?

- Advertisement -

ఇండియన్స్‌ను ఉద్దేశించి రష్యాలో మోడీ చేసిన ప్రసంగంలో ఓ పార్ట్ ఇది. ఫిర్‌ బీ దిల్‌ హే హిందూస్థానీ అంటూ ప్రవాస భారతీయులో ముచ్చటించారు మోడీ. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇండియా మరింత అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. కానీ ఇవన్నీ నాణానికి ఓ వైపు.. ఇప్పుడు నాణానికి మరో వైపు చూద్దాం. మోడీ రష్యాలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాల చూపు అటువైపే ఉందని చెప్పాలి. ఇద్దరి నేతల బ్రోమాన్స్‌ మాత్రం అదిరిపోయింది.

- Advertisement -

ఈ టూర్‌లో కొంచెం అఫిషియల్ కాగా.. కొంచెం అనఫిషియల్‌గా తెలుస్తోంది. ఓ పెద్ద ఎస్టేట్‌ అంటే పుతిన్‌ కు చంఎదిన నోవో-ఒగారియోవోలో మోడీతో భేటీ అయ్యారు. గంటపాటు చ్చలు జరిపారు. షేక్‌ హ్యాండ్‌లు, ఆలింగనాలు, బ్యాటరీ వెహికల్స్‌లో ప్రయాణించడం.. ఇలా ప్రతి ఒక్కటి ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని పెంచేదే. అయితే ఈ చర్చల కారణంగా మనకు కొంచెం మంచే జరిగిందని చెప్పాలి.

Also Read : అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ

రష్యా- ఉక్రెయిన్‌ వార్‌లో చిక్కుకుపోయిన కొంతమంది భారతీయులు ఇక స్వదేశానికి రానున్నారు. ఉపాధి అవకాశాల కోసం రష్యా వెళ్లిన కొందరు భారతీయులను యుద్ధక్షేత్రాలకు పంపారు. రష్యన్ ఆర్మీకి సహాయం చేయడం వారి పని. నిజానికి ఇలా పనిచేయడం ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అందుకే చాలా మంది తిరిగి వచ్చేయాలనుకున్నారు. కానీ.. వారికి రష్యా ఆ చాన్స్ ఇవ్వలేదు. దీంతో తమను తిరిగి రప్పించండి బాబోయి అంటూ వారంత కేంద్రాన్ని మొరపెట్టుకున్నారు. ఇదే టాపిక్‌ను తన చర్చల్లో ప్రస్తావించారు మోడీ. దీనికి పుతిన్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వెరీ సూన్ వారంతా తిరిగి ఇండియాకు చేరుకోనున్నారు.

ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆగిపోయిన భారత్‌-రష్యా సదస్సు తిరిగి ప్రారంభమైంది. ఈ సదస్సులో ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు. వ్యాపారం, ఇంధన కొనుగోళ్లు, ఆయుధాలు ఇలా ప్రతి అంశంపై చర్చించారు ఇరువురు నేతలు. ఇక రష్యన్ యాంగిల్‌ చూసుకుంటే భారత ప్రధాని ఇలాంటి సమయంలో పర్యటించడం.. ఆ దేశానికి బిగ్ రిలీఫ్‌. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాను ఒక్క చైనా తప్ప ఆల్‌మోస్ట్‌ అన్ని దేశాలు వెలేసినంత పనిచేశాయి. అమెరికా, యూరప్‌తో పాటు.. మాజీ సోవియట్ దేశాలు కూడా రష్యాపై కత్తులు నూరుతున్నాయి. అందుకే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ రావడం చాలా గొప్ప విషయం. అంతేకాదు మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రెండో విదేశీ పర్యటనకు రష్యానే చూస్‌ చేసుకున్నారు మోడీ. దీంతో ప్రపంచానికి తగ్గేదేలే అనే ఓ మెసేజ్ పంపింది రష్యా.

అంతేకాదు.. ప్రపంచం వెలివేతతో ఇండియాకు మరింత ఇంపార్టెన్స్ ఇస్తుంది రష్యా. ఇది మనకు అనుకూలమైన విషయం. దీనిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు విదేశాంగశాఖ సిద్ధంగా ఉంది. క్రూడాయిల్ విషయంలో సరికొత్త ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత రష్యా నుంచే మనం ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు భారత్ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం రష్యన్ ఆయిల్ కంపెనీలతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే మనం రష్యా నుంచి రోజుకు 1.97 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ.
అంతేకాదు.. చమురు విషయంలో చైనా కంటే ఇండియాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది రష్యా.

Also Read : భారత్, ఆస్ట్రియా స్నేహం మరింత బలపడనుంది.. ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోదీ

అయితే ఈ విషయాలన్నింటినీ ఓ కంట కనిపెడుతూనే ఉంది అమెరికా. అయితే డైరెక్ట్‌గా మనల్ని డైరెక్ట్‌ చేసే పరిస్థితిలో లేదు అమెరికా. అలాగని బెదిరించే అవకాశం కూడా అస్సలు లేదు. అందుకే.. మోడీ రష్యా పర్యటనలో ఉన్న సమయంలోనే భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్ చేసింది. రష్యాతో దోస్తీ విషయంలో భారత్‌ను అప్రమత్తం చేస్తున్నామని.. అయితే చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మాత్రం కోరింది అమెరికా. నిజానికి ఇది కూడా మన దౌత్య విజయం అని చెప్పుకోవాలి. మామూలుగా అయితే అమెరికా అగ్గిమీద గుగ్గిలమవ్వాలి.. అవసరమైతే భారత్‌పై ఆంక్షలు విధించాలి. కానీ ఆ సాహసం చేసే పరిస్థితిలో లేదు అమెరికా. అందుకే సింపుల్‌గా ఉక్రెయిన్‌ టాపిక్‌ను తెరపైకి తీసుకొచ్చి చేతులు దులుపుకుంది.

అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మాత్రం మోడీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన నేతను ప్రజాస్వామ్య దేశానికి చెందిన నేత ఆలింగనం చేసుకున్నారంటూ ఓపెన్‌గా మండిపడ్డారు. కానీ.. పుతిన్‌తో ఉక్రెయిన్‌ యుద్ధ విషయాన్ని మోడీ ప్రస్తావించారన్న సంగతి తెలుసో లేదో తెలియదు. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని.. యుద్ధంతో సమస్యకు పరిష్కారం లభించదని పుతిన్‌కు మన ప్రధాని చెప్పినట్టు విదేశాంగశాఖ తెలిపింది.

నిజానికి మన దేశానికి, రష్యాకు ఉన్న బంధం ఇప్పటిది కాదు. ఎన్నో సంక్షోభ సమయాల్లో రష్యా మనకు ఆపన్నహస్తం అందించింది.. అండగా ఉంది. అందుకే రష్యా విషయంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. స్నేహహస్తాన్నే చాటాయి. ఇప్పుడిదే రూల్‌ను మోడీ కూడా పాటిస్తున్నారు. ప్రస్తుతం రష్యా ఉన్న పరిస్థితుల్లో ఆ దేశంతో మనం చేసుకునే ఒప్పందం చేసుకోవడం అనేది విన్‌ సిట్యూవేషన్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News