Big Stories

Mercedes G-Wagon Electric : మెర్సిడెస్ బెంజ్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. అదరగొడుతున్న లుక్!

Mercedes G-Wagon Electric : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తుగా ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫోర్ వీలర్ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. మార్కెట్ ప్రజెంట్ జనరేషన్‌‌కి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీతో కార్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్మన్ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కార్ల ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రిక్ జి వ్యాగన్‌ లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. జి వ్యాగన్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేసింది. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి. దాని రేంజ్ తదితర విషయాల గురించి తెలుసుకోండి.

- Advertisement -

మెర్సిడెస్ బెంజ్ జి వ్యాగన్ ఎలక్ట్రిక్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ G580ని ఎలక్ట్రిక్ వెర్షన్‌గా తీసుకురానుంది. సామర్థ్యం పరంగా ఇది ICE వెర్షన్ కంటే సమర్ధవంతంగా ఉంటుంది. దీనితో పాటు G వ్యాగన్‌లో అనేక అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. వెహికల్ ముందు భాగంలో ఎలక్ట్రిక్ G580  ఫ్రేమ్‌ ఉంది. ఇది కాకుండా బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, EQ టెక్నాలజీ, G-టర్న్, G-స్టీరింగ్ వంటి అనేక గొప్ప ఫీచర్లు ఇచ్చారు. ICE వెర్షన్ ఫీచర్లు కూడా ఇందులో చూడొచ్చు.

- Advertisement -

Also Read : అల్ట్రావయోలెట్ మ్యాక్ 2 బుకింగ్స్ స్టార్ట్.. ఈ బైక్ రెండు ట్రక్కులను లాగగలదు!

మెర్సిడెస్ బెంజ్ G580 ఎలక్ట్రిక్‌లో 115kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. దీని కారణంగా ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 475 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అదే సమయంలో ప్రతి చక్రానికి ఒక మోటార్ ఉంటుంది. నాలుగు మోటార్లు 587 bhp పవర్, 1165 న్యూటన్ మీటర్ల టార్క్‌ను రిలీజ్ చేస్తాయి. ఈ ఎస్‌యూవీని కేవలం 4.6 సెకన్లలో సున్నా నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ మోటార్లకు ప్రత్యేకంగా 2-స్పీడ్ గేర్‌బాక్స్ సెట్ చేశారు.

Also Read : రూ.15 లక్షల్లో బెస్ట్ కారు ఇదే.. ఒక్కసారి కొంటే చాలు!

ఈ ఎలక్ట్రిక్ వాహన ధర గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ప్రారంభించే సమయానికి దాదాపు రూ.1.50 కోట్లు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం ఇది బీజింగ్ ఆటో షోలో ప్రదర్శించారు. వచ్చే ఏడాదికి భారతీయ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News