BigTV English

David Warner: ఆధార్ కార్డు కావాలా? వార్నర్.. ఇండియాలో సెటిల్ అయిపోతావా?: నెటిజన్ల ప్రశ్నలు

David Warner: ఆధార్ కార్డు కావాలా? వార్నర్.. ఇండియాలో సెటిల్ అయిపోతావా?: నెటిజన్ల ప్రశ్నలు

David Warner Viral Video: డేవిడ్ వార్నర్ అంటే ఇండియాలో తెలియని వారంటూ ఎవరూ లేరు. క్రికెట్ అభిమానులే కాదు, భారత ప్రజలకి కూడా దగ్గరైన క్రికెటర్ గా తను పేరు సంపాదించుకున్నాడు. అంతటి అభిమానం సంపాదించుకున్నాడు. నిజానికి డేవిడ్ వార్నర్ ఎప్పుడూ సరదాగా ఉంటాడు. జట్టులో ఉన్నంతసేపు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక పుష్ప సినిమాలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ టైప్ లో చేసిన మేనరిజమ్స్, 2023 వన్డే వరల్డ్ కప్ లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దానిని ఇంకా ఎవరూ మరిచిపోలేదు.


తను ఇటీవలే టెస్ట్, వన్డేలకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఓపిక ఉన్నంతవరకు లీగ్ లు ఆడుతుంటానని అన్నాడు. అలా ప్రపంచంలో పలు దేశాల్లో లీగ్ మ్యాచ్ లు ఆడుతున్నాడు. అలా ఇండియాలో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. అంతకుముందు హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ఆడి ట్రోఫీ కూడా తెచ్చాడు.

ప్రస్తుతం తను ఖాళీ సమయాల్లో ఎప్పటిలాగే రీల్స్ చేస్తున్నాడు. సందడి చేస్తున్నాడు. కేవలం ఆటతోనే కాకుండా ఇలా ఎంటర్ టైన్మెంట్ తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉన్నాడు. అన్నింటికి మించి తెలుగు సినిమాల్లోని పాటలకు తన కుటుంబంతో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ.. రీల్స్‌ చేస్తూ సరదా వీడియోలతో టెన్షన్ లేకుండా గడిపేస్తున్నాడు. అయితే తన మనసు చాలా మంచిది, చాలా సున్నితమైన వాడిగా అందరూ చెబుతుంటారు.


అయితే తనకి హిందీ భాషమీద మంచి పట్టు చిక్కింది. ఈ క్రమంలో తను చేసిన ఒక రీల్ ని.. ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదిప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మంచి ట్రెండింగులో ఉంది. ఇంతకీ రీల్ లో ఏముంది అంటే…
వార్నర్ పక్కన పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. వార్నర్ ప్రాక్టీసు చేస్తుండగా తన దగ్గరకి ఆ వ్యక్తి వస్తాడు. వచ్చి…
వార్నర్‌ మంచి మూవీ వచ్చింది చూడటానికి వెళ్దామా? అంటాడు
అందుకు వార్నర్ బదులిస్తూ… నహీ యార్ అంటాడు.
అయితే ఫ్రీగా మంచి భోజనం పెడుతున్నారు తిందాం ఛలో! అంటాడు..
దానికి కూడా వార్నర్… నహీయార్, నహీయార్ అంటాడు.
ఆ…. అయితే అక్కడ అందమైన అమ్మాయి ఉందంట పద వెళ్దాం! అంటాడు….
దానికి కూడా వార్నర్ డల్ గా నహీయార్… అంటాడు.
ఏటి మనోడు… దేనికి నో అంటున్నాడు.. అని అనుకున్న ఆ వ్యక్తి,
అయితే సరే పదా…. అక్కడ ఆధార్ కార్డు ఇస్తున్నారు… అంటాడు.
అనగానే వార్నర్ ఒక్క ఉదుటున ఆ వ్యక్తిని ఎత్తుకుని… ఎక్కడ? ఎక్కడ? అంటూ పరిగెడతాడు.

Also Read: Sachin love story: సచిన్‌కు బర్త్ డే విషెస్, లవ్ స్టోరీ లోతుల్లోకి వెళ్తే..

ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందరూ వార్నర్ ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఏమిటి వార్నర్, ఇండియాలో సెటిల్ అయిపోతావా? అని అడుగుతున్నారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×