Mudra Loan Scheme: కేంద్రం తీసుకువచ్చిన కొన్ని మంచి పథకాలలో ముద్ర లోన్ ముఖ్యమైనది. ఈ పథకం ద్వారా షూరిటీ లేకుండా ఏకంగా రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో మొత్తం మూడు రకాల రుణాలు ఇస్తారు. శిశు రుణాల కింద రూ.50 వేల వరకు లోన్ ఇస్తారు. కిశోర రుణాల కింద రూ.50 వేల నుండి రూ.5 లక్షల వరకు ఇస్తారు. అదే విధంగా తరుణ్ రుణాల కింద రూ.5 నుండి 10 లక్షల వరకు రుణం ఇస్తారు.
Also read: ఈ ఏడాదే ప్రారంభం.. శబరిమలలో ఫ్రీ వైఫై, చాట్ బాట్ ఇంకా ఎన్నో.. ఎలా ఉపయోగించుకోవాలంటే!
అంతే కాకుండా తరుణ్ ప్లస్ రుణాల కింద రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు పొందవచ్చు. అయితే ఒకసారి తరుణ్ లోన్ తీసుకుని తిరిగి చెల్లించిన వారికే రూ.10 నుండి రూ.20 లక్షల వరకు రుణం ఇవ్వాలనే కండిషన్ కూడా ఉంది. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహితుల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చారు. మొదట కార్పొరేట్, వ్యవసాయేతర, సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం పీఎంఏవై పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోడీ ప్రారంభించారు.
ఆ తరవాత రుణాలను పీఎంఏవై పథకాన్ని ముద్ర రుణాలుగా వర్గీకరించారు. ఈ రుణాలను బ్యాంకులే అందిస్తాయి. నాన్ బ్యాంకింగ్- బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు సైతం ఇస్తుంటాయి. ఈ పథకం ద్వారా డైరీ, పౌల్ట్రీ, తేనె టీగల పెంపకం ఇతర వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు, ఇతర చిన్న వ్యాపారాలు చేసుకునే వారు లోన్ తీసుకోవచ్చు. ముద్ర లోన్ నుండి రుణం పొందితే వడ్డీ రేట్ల ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో వేరు వేరుగా ఉంటాయి.
ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15 నుండి 12.80 శాతం వరకు ఉంటాయి. అదే విధంగా ప్రైవేటు బ్యాంకుల్లో రుణం తీసుకుంటే 6.96 నుండి 28 శాతం వరకు ఉంటాయి. అంతే కాకుండా రుణం తీసుకునేవారి రిస్క్ ప్రొఫైల్ ఇతర అంశాల ఆధారంగా రుణం కాలవ్యవధి, ఎంత లోన్ తీసుకుంటున్నారు అనే దానిని బట్టి కూడా వడ్డీ రేట్లు మారుతాయి. సొంత ఊర్లో ఉంటూ తాము ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించాలనే ఆశయం ఉంటే ముద్ర లోన్ అనేది చాలా మంది ఆప్షన్ అనే చెప్పవచ్చు.