Singer Mika Singh : సెలబ్రిటీ స్టేటస్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులు వాళ్ళని చూడగానే సంబరపడిపోతారు. తమ అభిమాన సెలబ్రిటీతో కలిసి ఒక్క ఫోటో దిగడానికి ఉవ్విళ్లూరతారు. అలాగే సెలబ్రిటీలు తమను అభిమానించే ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారు. ఇదంతా సాధారణ అభిమానులు చేసే పని. అదే అభిమానులు కోటీశ్వరులైతే ఎలా ఉంటుందో తాజాగా సింగర్ మికా సింగ్ (Mika Singh) విషయంలో తెలిసొచ్చింది. ఏకంగా స్టేజ్ పై ఓ అభిమాని కోట్లాది విలువైన గిఫ్ట్ ల వర్షం కురిపించి, ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు.
హీరోలకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్స్ ఉండడం అన్నది సర్వసాధారణం. అయితే ఇలాగే కొంతమంది సింగర్స్ కు కూడా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు. అందులోనూ డై హార్డ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన చూశాక ఇంతటి ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారా అని అబ్బుర పడుతున్నారు జనాలు. ఈ ఖరీదైన ఫాన్స్ అని ఎందుకు అంటున్నామంటే… బెంగాల్ కు చెందిన పాపులర్ సింగర్ కం రాపర్ మికా సింగ్ (Mika Singh) కు ఇటీవల ఎవరైన సంఘటనను తెలుసుకోవాల్సిందే.
ఇటీవల మికా సింగ్ (Mika Singh) యూఎస్ లో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ను నిర్వహించారు. ఈ కాన్సర్ట్ లో ఇండియాతో పాటు పలు దేశాలలో ఉన్న ఆయన అభిమానులు అందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇక ఈ మ్యూజిక్ కాన్సర్ట్ కి పాకిస్తాన్ అభిమానులు కూడా హాజరయ్యారు. మికా సింగ్ మ్యూజిక్ తో అభిమానులంతా ఉర్రూతలూగుతున్న వేళ స్టేజిపై ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇది మికా సింగ్ కు కూడా ఊహించని సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఓ అభిమాని డైరెక్ట్ గా స్టేజ్ మీదకు వచ్చి, కోట్లాది విలువైన బహుమతులతో తన అభిమానాన్ని చాటుకున్నారు. మికా సింగ్ కు సదరు అభిమాని ఏకంగా 3 కోట్ల విలువైన బహుమతులను కానుకగా ఇవ్వడం విశేషం. అత్యంత ఖరీదైన బంగారు గొలుసుతో పాటు రోలెక్స్ వాచ్, డైమండ్ రింగులను స్టేజ్ పై బహుకరించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ వీడియోను మికా సింగ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అభిమానం బంగారం అయిన వేళ అన్నట్టుగా ఉంది ఈ వీడియో.
కాగా మికా సింగ్ (Mika Singh) ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు. మికా సింగ్ సెన్సేషనల్ సింగర్ దలేర్ మెందీకి సోదరుడి వరుస అవుతారు. హిందీ పాటలతో పాటుగా మికా సింగ్ భాంగ్రా, పాప్ ఆల్బమ్స్ తో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ మికా.. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలో ‘యాహు యాహు’ అనే పాటతో మూవీ లవర్స్ ను ఉర్రూతలూగించాడు. రవితేజ ‘బలుపు’, ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’ సినిమాలలో కూడా ఈ సింగర్ పాడారు.