Big Stories

IPL 2024-MS Dhoni: విశాఖ గడ్డపై.. రికార్డులు తిరగరాసిన ధోనీ

DC vs CSK, IPL 2024
 

MS Dhoni Records 300 Dismissals As Wicketkeeper In T20s: ఐపీఎల్ మ్యాచ్ ల్లో కొత్త రికార్డులు ధనాధన్ మని మెరుస్తున్నాయి. కొన్ని పక్కకు వెళుతున్నాయి. కొన్ని బ్రేక్ అవుతున్నాయి. కొన్ని కొత్తవి పుట్టుకొస్తున్నాయి. విశాఖలో జరిగిన చెన్నయ్ సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో ధోనీ రికార్డులను తిరగరాశాడు.

- Advertisement -

టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మందిని వెనక్కి పంపిన కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆర్సీబీ కీపర్ దినేశ్ కార్తీక్, లక్నో కీపర్ క్వింటన్ డీకాక్ వంటి వారిని వెనక్కి నెట్టేశాడు. టీ20 లో వికెట్ల వెనుక ఉండి 300 మందిని ధోనీ వెనక్కి పంపాడు. వీటిలో 213 స్లిప్ క్యాచ్‌లు ఉన్నాయి. అంటే ఎంత షార్పుగా తను డైవ్ చేసి, నీటిలో చేప పిల్లల్ని పట్టినట్టు, గాలిలో ఎగురుతూ క్యాచ్ లు పట్టేస్తున్నాడు.

- Advertisement -

ధోనీ తర్వాతి స్థానంలో దినేశ్ కార్తీక్ 276 (207 క్యాచ్‌లు), కమ్రాన్ అక్మల్ 274 (172 క్యాచ్‌లు ), క్వింటన్ డీకాక్ 269 (220 క్యాచ్‌లు), జోస్ బట్లర్ 208 (167 క్యాచ్‌లు) టాప్-5లో ఉన్నారు.

Also Read: వైజాగ్‌లో పంత్, వార్నర్, పృథ్వీ ‘షో’.. ఢిల్లీ బోణీ.. 

ఇవన్నీ కాకుండా అత్యధిక సిక్సర్ల రికార్డులో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసి, తను ముందు వరుసలోకి వచ్చేశాడు. ఐపీఎల్ అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లలో క్రిస్ గేల్ నెంబర్ వన్ గా ఉన్నాడు. తను 141 ఇన్నింగ్స్ లో 357 సిక్సర్లు కొట్టాడు. తర్వాత రోహిత్ శర్మ 240 ఇన్నింగ్స్ లో 261 సిక్సర్లు కొట్టాడు.
మూడోస్థానంలో ఏబీడివిలియర్స్ ఉన్నాడు. తను 170 ఇన్నింగ్స్ లో 251 సిక్సర్లు కొట్టాడు.
తాజాగా నాలుగో స్థానంలోకి ఎంఎస్ ధోనీ వచ్చాడు. తను 219 ఇన్నింగ్స్ లో 242 సిక్సర్లు కొట్టాడు. తన తర్వాత ప్లేస్ లో విరాట్ కొహ్లీ 232 ఇన్నింగ్స్ లో 241 సిక్సర్లు కొట్టాడు.

ఇప్పుడందరూ అనేదేమిటంటే, తను కొంచెం ముందు వచ్చి ఉంటే చెన్నయ్ సూపర్ కింగ్స్ గెలిచేదని అభిమానులు కామెంట్లు మొదలెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News