BigTV English

Cheapest SUVs with 6 Airbags: ప్రాణం ముఖ్యం బిగులు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో చౌకైన SUVలు..!

Cheapest SUVs with 6 Airbags: ప్రాణం ముఖ్యం బిగులు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో చౌకైన SUVలు..!

Cheapest SUVs with 6 Airbags: దేశీయ మార్కెట్‌లో ఆటో మొబైల్ రంగానికి మంచి డిమాండ్ ఉంది. అందులోనూ కార్లపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకప్పుడు వాహన ప్రియులు కారు ధరల విషయంలో ఆలోచించేవారు. కానీ ఇప్పుడు కారు ధరలతో పాటు సేఫ్టీ ఫీచర్ల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం తమ కార్లలో సేఫ్టీ ఫీచర్‌లపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ప్రీమియం లగ్జరీ కార్లలో మాత్రమే 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు అత్యంత చౌక ధర వాహనాల్లో కూడా డ్రైవర్, ప్రయాణికులకు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తున్నాయి. అందువల్ల మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్న సేఫ్టీ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇక్కడ కొన్ని అత్యుత్తమ కార్ల ఉన్నాయి.


మహీంద్రా XUV 3XO

దేశీయ మార్కెట్‌లో మహీంద్రా కార్లకు మంచి డిమాండ్ ఉంది. అందులో మహీంద్రా XUV 3XO ఒకటి. ఈ కారు భారతదేశంలో ఈ ఏడాది లాంచ్ అయింది. అయితే లాంచ్ అయిన అతి కొద్ది కాలంలోనే ఈ SUV మార్కెట్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో 5 మంది కూర్చునే స్థలం ఉంది. అలాగే సేఫ్టీ విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. లెవల్ 2 ADAS, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అతిపెద్ద సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది.


ఇక దీని ఇంజన్ విషయానికొస్తే.. ఇందులో 3 ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో దాని రెండవ ఇంజన్.. 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 96kW పవర్, 200 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని మూడవది 1.5L టర్బో డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 86Kw పవర్, 300 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అమర్చబడి ఉంటాయి. ఇవి 21.2 కి.మీ మైలేజీని అందిస్తాయి. ఈ XUV 3XO రూ. 7.49 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

Also Read: ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయి.. సింగిల్ ఛార్జింగ్‌పై పరుగులే పరుగులు..!

హ్యుందాయ్ ఎక్స్‌టర్

హ్యుందాయ్ మోటార్ ఇండియా చౌకైన కాంపాక్ట్ SUVలను లాంచ్ చేస్తూ వాహన ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. అందులోనూ హ్యుందాయ్ ఎక్స్‌టర్ మరింత ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికీ బెస్ట్ సెల్లింగ్ వాహనాల జాబితాలో ఎక్సెటర్ నిలిచింది. ఇందులో 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది 81బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది. ఈ కారు 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇందులో సేఫ్టీ కోసం.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ABS + EBD, రియర్ పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, హై స్పీడ్ అలర్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ కార్లకు దేశీయ మార్కెట్‌లో ఎంతటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెక్సాన్ దాని విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVగా పేరుగాంచింది. ఇందులో స్పేస్ చాలా బాగుంటుంది. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 7.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 1.2లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇందులో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS + EBD, వెనుక పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, హై స్పీడ్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Tags

Related News

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

పది నిమిషాల్లో ల్యాండ్ కొనేయండి.. వావ్, ఆ యాప్ నుంచి సరికొత్త సర్వీస్!

Tata Sierra SUV: రెండు వెర్షన్లలో టాటా సియెర్రా, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Google Fined: గూగుల్ కు షాక్, రూ. 300 కోట్లు జరిమానా విధించిన ఆస్ట్రేలియా!

Cheques: చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

జియో షాకింగ్ నిర్ణయం.. ఆ రిచార్జ్ ప్లాన్‌ తొలగింపు? ఇలాగైతే కష్టమే!

Big Stories

×