Gujarat Tragedy: గుజరాత్ రాష్ట్రంలోని పంచ్ మహల్ జిల్లాలోని ప్రసిద్ధ పాల్గఢ్ హిల్ శక్తి పీఠం వద్ద విషాదం చోటుచేసుకుంది. కార్గో రోప్‌వే వైర్ ఆకస్మికంగా తెగిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్ మెన్లు, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో జరిగిందని తెలిపారు. నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. పాల్గఢ్ కొండపై ఉన్న మహాకాళి ఆలయాన్ని ఏటా 25 లక్షల మంది సందర్శిస్తుంటారని అంచనా.
ప్రమాదంపై స్పందించిన పంచ్‌మహల్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ హరీష్ దుధత్ వివరాలను తెలిపారు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే ఆ ప్రాంతమంతా భయాందోళనకు గురైందని వెల్లడించారు. పాల్గఢ్ కొండ సముద్ర మట్టానికి దాదాపు 800 మీటర్ల ఎత్తులో ఉంటుందరని తెలిపారు. ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు 2000 మెట్లు ఎక్కాలి లేదా రోప్‌వే ద్వారా వెళ్లాల్సి ఉంటుందన్నారు.
సంఘటనలు జరగకుండా చూడాలి.. భక్తులు డిమాండ్
అయితే, వస్తువులను మోసుకెళ్లడానికి ఉపయోగించే కార్గో రోప్‌వేలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాలులు బలంగా వీస్తుండటంతో ముందే రోప్‌వే సర్వీసులను నిలిపివేశారని అధికారులు వెల్లడించారు. మహాకాళి అమ్మవారికి అంకితం చేసిన ఈ పాల్గఢ్ శక్తి పీఠానికి ప్రతి సంవత్సరం సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే ఈ ప్రమాదం కారణంగా అక్కడి భక్తుల్లో భయాందోళనకు గురయ్యారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆరుగురు మరణించినట్టు, మృతదేమాలను పోస్ట్‌మార్టంకు తరలించామని తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలపై పూర్తి సాంకేతిక దర్యాప్తు అనంతరమే స్పష్టత వస్తుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం, మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషాదం పాల్గఢ్‌లో దర్శనానికి వచ్చే భక్తులను తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కట్టుదిట్టమైన సహాయక చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి, ఆలయానికి వెళ్లే దారులను ఎటువంటి ఆటంకంట లేకుండా నిర్మించాలని కోరుతున్నారు.
తెగిన రోప్‌వే కేబుల్ వైర్.. ఆరుగురు మృతి!
గుజరాత్ రాష్ట్రం పంచమహల్ జిల్లాలో తీవ్ర విషాదం
పాల్గఢ్ హిల్ వద్ద ఉన్న కార్గో రోప్‌వే కేబుల్ వైరు తెగిపడి ఆరుగురు మృతి
నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం
పాల్గఢ్ కొండపై ఉన్న మహాకాళి ఆలయాన్ని ఏటా 25… pic.twitter.com/lgOgkaxKcj
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2025